జాకీ అవతారం ఎత్తిన బోయపాటి
దర్శకుడు బోయపాటి శ్రీను రేడియో జాకీ అవతారం ఎత్తారు. తన తాజా సినిమా 'దమ్ము' ప్రమోషన్లో భాగంగా బుధవారం ఆయన రేడియో మిర్చి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. శ్రోతలు, అభిమానులతో తన అనుభూతులు పంచుకున్నారు. దమ్ము చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న వారందిరీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జూ ఎన్టీఆర్ హీరోగా బోయాపాటి దర్శకత్వంలో రూపొందిన 'దమ్ము' చిత్రం ఏప్రిల్ 27న విడుదలై భారీ విజయం సాధించింది. ఈచిత్రంలో జూనియర్ సరసన త్రిష కార్తీక నటించారు. రెండు వంశాల మధ్య కక్షలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈచిత్రం సాగుతోంది.
తొలి రోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1400 థియేటర్లలో విడుదలై రూ. 13 కోట్ల వరకు షేర్ సాధించిందని, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే రూ. 9 కోట్లు వసూలు చేసిందని ఈ చిత్రం సక్సెస్ మీట్లో దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే భద్ర, తులసి, సింహా లాంటి హిట్ చిత్రాలు రూపొందించిన బోయపాటి 'దమ్ము' చిత్రంతో వరుసగా...నాలుగో సారి కూడా సక్సెస్ అయ్యారు.
బోయపాటి తన నెక్ట్స్ ప్రాజెక్టు మహేష్ బాబుతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబులో ప్రేక్షకులు చూడని సరికొత్త మాస్ కోణాన్ని చూపించడానికి కథను రెడీ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











