»   » మంత్రిగారి గెస్ట్‌హౌస్‌ బయట... బాలకృష్ణ

మంత్రిగారి గెస్ట్‌హౌస్‌ బయట... బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలకృష్ణ ఓ మంత్రి గారి గెస్ట్ హౌస్ బయిట ఉన్నారు. ఆయనతోపాటు జయప్రకాశ్‌రెడ్డి, చలపతిరావు వచ్చారు. ఆయన మంత్రి దగ్గరికి ఎందుకొచ్చినట్లు.. ఏం చర్చించారనేది అనే ఆసక్తి కలుగుతోందా...అయితే ఇదంతా సినిమా గురించి..అది ఏమిటన్నది తెరపైనే చూడాలి. షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఎం.పి.బిల్డింగ్‌ పరిసరాల్లో జరుగుతోంది.

సామాజిక అంశాల నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. రాధిక ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ నాయికలు. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన ఓ మంత్రిగారి గెస్ట్‌హౌస్‌ సీన్స్ తీసారు. నేటితో ఇక్కడ చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెల మొదటివారం నుంచి విశాఖపట్నంలో చిత్రీకరణ జరుగుతుంది. అభిమానులు అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి శక్తిమంతంగా బాలయ్య పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు ఇందులో విలన్ పాత్ర పోషించడం విశేషం. ఆయనకు జంటగా ఇందులో కల్యాణి నటిస్తున్నారు.

4రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణకున్నపవర్ ఫుల్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసేలా ఈ సినిమా ఉండబోతుందని మీడియా వర్గాల సమాచారం.

English summary
Nandamuri Balakrishna is busy shooting in Ramoji Film City for an untitled film under Boyapati Seenu’s direction. Major scenes of the film are being shot in the combination of Balakrishna and Jagapathi Babu who is playing villain. Sonal Chauhan is playing female lead and another heroine Radha Apte finalized.
 There are lot of expectations on this film as Balakrishna is acting under Boyapati’s direction after blockbuster Simha. Devisri Prasad is composing music for the first time for Balakrishna. 14 Reels Entertainment is producing this message oriented mass entertainer. There are rumors in film nagar that Legend is the title of the film but the makers didn’t confirm it yet. This film will hit the screen before 2014 general elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu