నందమూరి హీరోలను రక్తంతో...మెగా హీరోలను లవ్వుతో?
హైదరాబాద్ : బోయపాటి సినిమా అంటే రక్తపాతం, తలలు తెగనరకడాలు లేకుండా సినిమా ఉండదు అనేది టాలీవుడ్ ఎరిగిన సత్యం. గతంలో ఆయన నందమూరి హీరోలైన బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన 'సింహ', 'దమ్ము', 'లెజెండ్' చిత్రాల్లో ఏరేంజిలో రక్త ఏరులై పారిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
అయితే రామ్ చరణ్ విషయంలో మాత్రం పూర్తిగా రివర్స్ పంథా అనుసరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవల బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్‌తో సినిమా చేసే విషయాన్ని మరోసారి ఖరారు చేసారు. అయితే ఈ సినిమాను ఆయన రక్త పాతంతో కూడిన స్టోరీతో కాకుండా...లవ్ స్టోరీతో కూడిన స్టోరీతో హ్యాండిల్ చేయన్నాడట.

తను తయారు చేసుకునే కథలో ప్రతీకారాలు, పగతో కూడిన అంశాలకు పెద్ద పీఠ వేసే బోయపాటి....ఈ సారి లవ్ స్టోరీకి పెద్ద పీఠ వేయడం చర్చనీయాంశం అయింది. గతంలో బోయపాటి సినిమాల్లో లవ్ ప్లేవర్ ఉన్నప్పటికీ అది కొంత వరకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ సారి మాత్రం లవ్ ఫ్లేవర్ పూర్తిగా ఉంటుందని అంటున్నారు. చూద్దాం....బోయపాటి ఈ సినిమాలో రొటీన్‌గా కాకుండా ఎలాంటి వేరియేషన్ చూపిస్తాడో?
ప్రస్తుతం రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు చరణ్.


Click it and Unblock the Notifications











