మహేష్ కి ఈ వారంలోనే కథ చెప్తున్నా
నేను ఇప్పటివరకూ మహేష్ కి కథ చెప్పలేదు. నేను వారంలోపే అతనికి కథ చెప్తాను...అప్పుడు పూర్తి వివరాలతో మీడియాకు చెప్తా అంటున్నారు బోయపాటి శ్రీను. మహేష్ తో మీరు చేస్తానన్న ప్రాజెక్టు ఎంత వరకూ వచ్చింది అని మీడియా వారు అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. అలాగే...తెలుగు పరిశ్రమలో నేను తెరమీద చూపించాల్సిన హీరోలు చాలా మంది ఉన్నారు. వారందరితో సినిమాలు తీయాలన్నదే నా అభిలాష. మంచి కథతో బాలకృష్ణగారితోకూడా సినిమా చేయాలని ఉంది. అంతేగానీ ఇతర పరిశ్రమలకు వెళ్ళే ఉద్దేశం లేదు అన్నారు.
అలాగే అన్నీ ఉంటేనే సినిమా. నేను 'బొమ్మరిల్లు' లాంటి సినిమా తీసినా అందులో కావాల్సిన చోట యాక్షన్ తప్పకుండా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు చుట్టూ ఎన్ని ఉన్నా మనసు చట్నీ మీదకు కూడా వెళ్తుంది కదా. యాక్షన్ అనేది చట్నీలాంటిది. అందుకే యాక్షన్ లేకుండా సినిమా తీయను అని చెప్పారు.
తన తాజా చిత్రం దమ్ము గురించి చెపుతూ...కె.ఎస్.రామారావుగారు, వల్లభ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. బడ్జెట్ గురించి ఆలోచించకుండా నేను ఏది ఆడిగితే దాన్ని ఇచ్చారు. 'దమ్ము' విషయంలో ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేశాం. ఎన్టీఆర్ గెటప్ కోసం చాలా ప్రయోగాలు చేశాం అన్నారు.
ఇక ఓ రోజు తారక్ ఇంటికెళ్ళి మీసకట్టు ఎలా ఉండాలో చర్చలు మొదలుపెట్టాం. నాకేమో కోరమీసం లుక్ కనిపించాలి. అది అంతకు ముందున్న ఆయన గెట ప్‌లను పోలి ఉండకూడదు. అందుకే హంగామా చేశాం. వాటన్నింటినీ చూసి ఎన్టీఆర్ 'నన్ను ప్రయోగశాల చేశావు శీనయ్య' అన్నారు. పాటలు కూడా వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి. 'రూలర్'లో హీరో కొత్తగా కనిపిస్తారు. 'ఓ లిల్లీ' సరదాగా ఉంటుంది. 'నీలో ఉంది దమ్ము' ఊపునిచ్చే పాట. 'రాజు వచ్చినాడు' గ్రాండియర్‌గా తెరకెక్కించాం. 'వాస్తు బావుందే' మాస్ పాట.''అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











