twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమండ్రి తొక్కిసలాట మృతులు: బోయపాటి శ్రీను వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం సంభవించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని...అదీ...బోయపాటి శ్రీను దర్శకత్వంలో చంద్రబాబు సినిమా షూటింగ్ జరిపారని, దాంతో ఆలస్యం జరిగి తొక్కిసలాట జరిగిందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై దర్శకుడు బోయపాటి శ్రీను ఖండించారు. సాక్షి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అవన్నీ అర్దం లేని ఆరోపణలు అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ... నేను సినిమా దర్శకుడుని కాబట్టి రంగుల్ని ఎలా ప్రెజెంట్ చెయాలన్నది పూర్తి అవగాహన ఉంది. పుష్కర ఘాట్లో హారతి మరింత బ్రైట్ గా ఉండేలా చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఆ భాధ్యత అప్పగించారు. దీని వల్ల దేశం నలు మూలల నుంచి వస్తున్న యాత్రికులు హారతి చూసి గొప్ప అనుభూతి పొందుతున్నారు. నేను జూలై 12 న పుష్కర ఘాట్ కు వెళ్లాను.

    Boyapati Seenu condemns rumours!

    పరిసరాల్ని గమనించే ఏం చేయాలో ఆలోచించాను. అదికారుల సహకారంతో స్ధానికంగా ఉన్న దుకాణాలు నుంచి కావాల్సిన వస్తువుల కొన్నాం. గుంటూరు నుంచి గొడుగులు తెప్పించాం హారతి అద్బుతంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఈ ఏర్పాట్లు చూసి భక్తులు ఆనందించాలన్నదే మా ఉద్దేశ్యం. చంద్రబాబు గారు నాకు చెప్పింది అదే.

    14వ తారీఖు డాక్యుమెంటరీ తీయటం లాంటిదేమీ జరగలేదు. నిజానికి నాకు డాక్యుమెంటరీ తీసేంత టైం లేదు. నా పని హారతి బాగా వచ్చేలా చేయటం వరకే. జులై 13 రాత్రి నా పని పూర్తయ్యింది. 14న ఉదయం ఏడున్నరకు గౌతమి ఘాట్లో పుష్కర స్నానం చేసి హైదరబాద్ కు బయిలుదేరిపోయాను అని బోయపాటి చెప్పారు.

    Boyapati Seenu condemns rumours!

    సోషల్ మీడియాలో గురువారంనాటి నుంచి ఈ ఫొటోతో కూడిన వ్యాఖ్యలు హల్‌చల్ చేస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లఘు చిత్రం కోసం గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానం చేస్తూ లఘు చిత్రం తీస్తున్నట్లు ఉన్న ఫొటో అది. చంద్రబాబు ప్రత్యర్థులు ఆ ఫొటోను షేర్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనిపై వివరణ రావటంతో మారుతుందని భావిస్తున్నారు.

    గోదావరి పుష్కరాలను మహా కుంభమేళాకు దీటుగా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం పొందాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నారని, ఈ మేరకు పుష్కర స్నానాలప్రారంభం, సిఎం కుటుంబ సభ్యులు పుణ్య స్నానాలు, లక్షలాది భక్తుల హాజరు, ఘాట్లలో హడావిడి అన్ని కలిపి ఓ డాక్యుమెంటరీ తీసి విదేశీ ప్రతినిధులకు చూపించి ఖ్యాతి పొందాలని చంద్రబాబు భావించారని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

    English summary
    Boyapati Srinu said: " There is nothing of Documentary of Godavari Pushkaralu on July 14th and I don't even have that much time. I was just given the job to brighten up harathi. After completing my work by July 13th night, I took a holy dip at Gouthami Ghat on July 14th morning at around 7:30. Soon after that, I went to airport to reach Hyderabad expecting heavy traffic due to Pushkaralu".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X