భద్ర,తులసి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఇఫ్పుడు మాస్ హీరో గోపీచంద్ డైరక్ట్ చేయటానికి రెడీ అవుతున్నారు. జెమీనీ ఫిల్మ్ సర్క్యూట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ పూర్తిగా బోయిపాటి చెప్పిన పవర్ ఫుల్ స్టోరీలైన్ కి ఇంప్రెస్ అయి పూర్తి స్ధాయి స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే మాస్ ప్రేక్షకుల నాడి తెల్సిన బోయపాటి మొదట నాగార్జున,ప్రభాస్,బాలకృష్ణ లకు కథ చెప్పి ఉన్నారు.అయితే అనుకోని విధంగా ఈ సినిమా మొటీరియలైజ్ అయింది. ఇక గోపీచంద్ ప్రస్తుతం 'శౌర్యం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. వెంటనే బోయిపాటి రెగ్యులర్ షూటింగ్ తో సినిమాను ప్రారంభిస్తారని చెప్తున్నారు. బెస్టాఫ్ లక్ బోయిపాటి...