యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వరూపాన్ని బయటకు తీస్తున్న బోయపాటి
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న దమ్ము సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందట. కమర్షియల్ చిత్రాలను తీయటంలో బోయపాటి శ్రీను ది అందె వేసిన చెయ్యి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దమ్ము" చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రం కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కమర్షియల్ విశ్వరూపాన్ని బయటకి తీయాలని బోయపాటి కృషి చేస్తున్నారు.
ఏ వల్లభ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోలాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే మైసూర్ లో ఒక భారీ ఏక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దమ్ము 2012 వేసవి సెలవులలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన మొదటి సారిగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తొలుత శృతి హాసన్ హీరోయిన్ కాగా, ఆమె డేట్స్ తో ఇబ్బంది రావటంతో చిత్రం నుండి వైదొలిగారు. రెండవ హీరోయిన్ గా కార్తీక నటిస్తోంది.
జూ ఎన్టీఆర్ నుంచి పూర్తిస్థాయి మాస్ సినిమా వచ్చి చాలా ఏళ్లవుతోంది. దమ్ముతో ఆ లోటు మొత్తం తీరిపోతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డుల మోత మోయించడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ అప్పుడే మొదలైంది..


Click it and Unblock the Notifications











