తప్పు కాదని బోయపాటి తేల్చి చెప్పాడు

By Srikanya

హైదరాబాద్ : ''ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి, తక్కువ రోజుల్లో ఎక్కువ వసూళ్లు సాధించాలని చూస్తున్నారు. అదేం తప్పుకాదు. పెరుగుతున్న బడ్జెట్‌, పైరసీ బెడద దాటాలంటే ఈ దారిలో వెళ్లాల్సిందే అంటున్నారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణతో వరసగా సింహా, లెజండ్ అంటూ చిత్రాలు చేసి సూపర్ హిట్ లు ఇచ్చిన ఆయన మరోసారి బాలయ్యతో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రస్తుతం సినిమా మార్కెట్ ఎదుర్కొంటున్న విమర్శలపై ఇలా మాట్లాడారు.

బాలకృష్ణతో మరోసారి చేయటం గురించి చెప్తూ.... ''నందమూరి బాలకృష్ణ దర్శకుల నటుడు. ఆయన్ని మలచుకోవడం దర్శకుల చేతుల్లోనే ఉంటుంది. ఆయనో అక్షయ పాత్ర. ఎన్ని రకాలుగా చూపించినా మరో కోణం మిగిలే ఉంటుంది'' అంటున్నారు బోయపాటి శ్రీను. ఇక బాలయ్య వందో సినిమా మీరు చేస్తున్నారా? అని అందరూ అడుగుతున్నారు. నాకు సంఖ్య ముఖ్యం కాదు. మంచి కథ ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమే''.

Boyapati Srinivas on Tollywood Business

లెజంజ్ విజయం గురించి చెప్తూ...''దర్శకుడిగా నేను కథని నమ్మాను. నన్ను బాలయ్య నమ్మారు.. అదే 'లెజెండ్‌' విజయ రహస్యం. కుటుంబ ప్రేక్షకులకు ఏం కావాలి? యువతరానికి ఏం కావాలి? ఆయన అభిమానులకు ఏం కావాలి? అనే లెక్కలు ఎప్పుడూ మర్చిపోలేదు. వాటితో పాటు మంచి కథ కుదిరింది. 'లెజెండ్‌' అనే పేరు విషయంలో పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే కథకు అదే సరైనది. బాలయ్య కూడా 'కథకు ఏది మంచిదైతే అదే పెట్టండి' అన్నారు అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తను చేస్తున్న ప్రాజెక్టుల గురించి చెప్తూ....బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నా. ఇది పూర్తిగా ప్రేమకథ. నా తరహా యాక్షన్‌ ఉంటుంది. శ్రీనివాస్‌ హెయిర్‌స్త్టెల్‌, హావభావాలు వీటిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. ఈ సినిమా పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. భద్ర తరహా యాక్షన్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంతో బోయపాటి యువ హీరోలను సైతం డైరక్ట్ చేసి హిట్ కొట్టగలడని ప్రూవ్ చేసుకుంటాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X