బోయపాటికి అడ్వాన్స్ ఆఫర్స్.. ఎన్ని కోట్లిచ్చినా ఒప్పుకోవడం లేదట?

కమర్షియల్ గా మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ బోయపాటికి ఇండస్ట్రీలో ఒక బలమైన మార్కెట్ ఉంది. కమర్షియల్ యాంగిల్స్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గిస్తున్న సమయంలో బోయపాటి శ్రీనివాస్ మాత్రం తన డైరెక్షన్ తోనే కమర్షియల్ డోస్ మరింత పెంచుతున్నారు. స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి చాలా వరకు సిద్ధంగానే ఉంటారు.

భద్ర సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి సినిమాలు కాస్త క్లిక్కయిన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకునే అవకాశం ఉంటుందని నిర్మాతలకు ఒక నమ్మకం ఉంది. అందుకే ఆయన కనిపిస్తే చాలు కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో బాలయ్యతో సింహా, లెజెండ్ సినిమాల తరువాత బోయపాటి వెంటవెంటనే అడ్వాన్సులు ఇచ్చారు.

Boyapati srinivas rejected producers advanced dealings

ఇక వినయ విధేయ రామ సినిమాతో కొంత డిజాస్టర్ అందుకున్నప్పటికి నెక్స్ట్ బాలయ్యాతో చేస్తున్న మూడవ సినిమాతో మంచి సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఆ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతున్నప్పటి నుంచి మళ్ళీ బోయపాటికి అడ్వాన్స్ ఇస్తామని, నెక్స్ట్ సినిమా మాతోనే చేయాలని చాలా మంది నిర్మాతలు డీలింగ్స్ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట.

కానీ బోయపాటి మాత్రం బాలకృష్ణ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మరో స్క్రిప్ట్ ని టచ్ చేయాలేనని, ఎన్ని కోట్లు ఇచ్చిన కూడా ఇప్పుడే మాట ఇవ్వలేనని అంటున్నాడట. మరి బాలకృష్ణ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియాలి అంటే కరోనా కాస్త అదుపులోకి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X