twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దమ్ము'లో ఎన్టీఆర్ చేసేదేమిటంటే...

    By Srikanya
    |

    ఎన్టీఆర్,బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...

    ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు.

    అలాగే ''పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్‌లోని యాక్షన్‌ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి. కీరవాణి మంచి పాటలు అందించారు. కథానాయిక పాత్రలకూ తగిన ప్రాధాన్యం ఉంది. కథకు లోబడే ఇద్దర్ని ఎంచుకొన్నాం. మైసూర్‌లో కీలక భాగం తెరకెక్కిస్తామని తెలిపారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో షూటింగ్ జరుగుతోంది. నెలాఖరు వరకూ హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలు, పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తారు.

    ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము పైనే ఎన్టీఆర్ పూర్తిగా దృష్టి పెడుతున్నారు.సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు.అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు. తన సక్సెస్ మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌.

    English summary
    'Dammu' shooting is happening at Mysore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X