twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జిమ్మిక్కులు సినిమాని నిలబెట్టవు : బోయపాటి శ్రీను

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''మనం ప్రచారాలతో ఎంత జిమ్మిక్కు చేసినా, ప్రారంభ వసూళ్లు దక్కుతాయంతే. సినిమా ఆడాలంటే.. బలమైన కథ ఒక్కటే ప్రధానం. బాలీవుడ్‌ తరహాలో పబ్లిసిటీ కోసం వింత పోకడలు పాటించవలసిన అవసరం లేదు. కాస్త సృజనాత్మకంగా ఆలోచించాలి. వీలైనన్ని ఎక్కువ రోజులు సినిమా ప్రచారం కోసం కేటాయించేలా సన్నాహాలు చేసుకోవాలి. సినిమా యూత్ కి దగ్గరైతే సరిపోదు. కుటుంబ ప్రేక్షకులకూ సినిమా సంగతుల్ని తెలియపర్చాలి. '' అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బోయపాటి శ్రీను తాజా చిత్రం దమ్ము పబ్లిసిటీ పరంగా బాగా చేసినా ప్రారంభ వసూళ్లే కానీ సినిమా స్టడీగా నిలబడలేకపోయిందనేది గమనార్హం.

    అలాగే తన వర్కింగ్ స్టైల్ ని గురించి బోయపాటి శ్రీను చెపుతూ...అది రవితేజ కావచ్చు..వెంకటేష్ కావచ్చు...బాలకృష్ణ కావచ్చు...ఎన్టీఆర్ కావచ్చు...ఎవరైనా సరే...వారి సొంత స్టైల్స్ ని నేను నా సినిమాలో పెట్టడానికి ట్రై చేస్తాను..అందుకే వారి అభిమానులకు నేను చేసిన సినిమాలు బాగా నచ్చుతాయి. హీరోతో నేను సినిమా కమిటయ్యే ముందు...వారు గతంలో చేసిన సినిమాలు పరిశీలించి స్క్రిప్టు రెడీ చేసుకుంటాను...వారి బాడీలాంగ్వేజ్ కి తగ్గట్లుగా నేను సీన్స్,కథనంలో మార్పులు చేసుకుంటాను..దాంతో అవి ఫెరఫెక్ట్ గా వారే ఆ పాత్ర కోసం పుట్టినట్లుగా తయరయ్యి ప్రేక్షకుల్లోకి బాగా వెళతాయి అన్నారు. అంతేగాక నేను చేసిన హీరోలంతా పెద్ద స్టార్స్ ..వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అది కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తీర్చిదిద్దుతాను అన్నారు.

    డైలాగులు విషయానికి వస్తే తాను చాలా శ్రద్ద తీసుకుంటానని..హీరో నోటి వెంట ఎలాంటి డైలాగులు చెపితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారో అలాంటి డైలాగులుకు ప్రయారిటీ ఇస్తానని అన్నారు. ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయని నేను ఎప్పుడూ ఒత్తిడి ఫీల్ కాను...నేను నిజాయితీగా స్క్రిప్టు దశనుంచి పనిచేస్తాను...బౌండెడ్ స్క్రిప్టు లేనిదే సినిమా చెయ్యను...మొదటి నుంచి అదే అలవాటు అన్నారు బోయపాటి శ్రీను.

    ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను-రామ్ చరణ్ కాంబినేషన్ చిత్రానికి వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ ఈ చిత్రం నిర్మిస్తానని మీడియాకు స్వయంగా తెలియచేసారు... మేము రెండు భారీ చిత్రాలతో వస్తున్నాము. త్వరలోనే ఇవి సెట్స్ కు వెళ్లనున్నాయి. అవి... మహేష్-రాజమౌళి కాంబినేషన్ చిత్రం, బోయపాటి శ్రీను-రామ్ చరణ్ చిత్రం. వాటి వివరాలు తర్వాత ప్రకటిస్తాం అన్నారు. బోయపాటి శ్రీను, మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ....నేను మహేష్ బాబుని కలవటం వరకూ నిజం...అయితే స్టోరీ లైన్ ఏదీ డిస్కస్ చేయలేదు. అయితే మేము త్వరలో కలిసి పనిచేస్తాం అన్నది మాత్రం నిజం...అలాగే నేను ఎక్సపెరిమెంట్స్ చేయదలచుకోలేదు...నేను మరో రెండు కమర్షియల్ హిట్ సినిమాలు చేసేదాకా నా పంధా వదలను అన్నారు.

    English summary
    
 Durga Arts films wants to make a film with Boyapati Srinu. "We have lined up some interesting films. Ram Charan - Boyapati film would take place. It would go to the sets shortly" K L Narayana told the media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X