»   » బాలయ్య ఏదైనా చెబితే చొచ్చుకు పోతుంది: బోయపాటి

బాలయ్య ఏదైనా చెబితే చొచ్చుకు పోతుంది: బోయపాటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకడు బోయపాటి శ్రీను ప్రస్తుతం విడుదలైన తన తాజా చిత్రం 'సరైనోడు' ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

'బాలయ్య తన సినిమాలో చెప్పే డైలాగులకు చాలా పవర్ ఉంటుంది. ఆయన ఏదైనా మాట చెబితే అది సొసైటీలోకి చొచ్చుకుపోయేంత స్థాయిలో ఉంటుందన్నారు. అదే విధంగా బాలయ్య చిత్రాల్లో చాలా హీట్ ఉంటుంది... ఉండాలి ' అని తన మనసులోని అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. బాలయ్య 100వ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ అవకాశం దర్శకుడు క్రిష్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

 Boyapati Srinu about Sarrainodu

'సరైనోడు' సినిమా గురించి మాట్లాడుతూ....సినిమాకు మంచి స్పందన వస్తోందన్నారు. తన సినిమాల్లో హీరో తీరును బట్టి పాత్ర డిజైన్ చేయడం జరుగుతుంది. ఏ హీరోతో మనం చేస్తున్నామనేది చాలా ముఖ్యం...ఆ హీరోపై ఉన్న అంచనాలకు తగిన విధంగా సినిమా చేయాలి అన్నారు.

తన చిత్రాల్లోని హీరో సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ ఉండడని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఎవరికి వాళ్లు కరెక్టుగా ఆలోచిస్తే ఒకళ్లను నిందించాల్సిన అవసరం ఉండదని, అదే తన సరైనోడు' చిత్రంలో హీరో పాత్ర అని బోయపాటి పేర్కొన్నారు. తన చిత్రాల్లో నటించే హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసం మాత్రం చూపించనని, కథకు వాళ్లు అవసరం ఉండేలా చూపిస్తానని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.

English summary
Sarainodu is a Telugu language action-masala film written and directed by Boyapati Srinu. Produced by Allu Aravind under Geetha Arts banner, it features Allu Arjun, Rakul Preet Singh and Catherine Tresa in the lead roles while Srikanth appears in a supporting role
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu