For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖండ లోకేషన్ లో బోయపాటి మంచి పనులు.. కోతులకు వాటిని అందిస్తూ..

  |

  ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ నెక్స్ట్ అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గక్ చెప్పనవసరం లేదు గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేశాయి ఇక ఇప్పుడు ఆ సినిమాల కంటే భారీ స్థాయిలో అఖండ సినిమా అంతకు మించి అనేలా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. బడ్జెట్ లో కూడా నిర్మాతలు ఏమాత్రం తగ్గడం లేదు.

  గతంలో బాలకృష్ణ బోయపాటి సినిమాలకంటే ఈ సినిమా కోసం అత్యధిక బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలతో అలరించబోతున్నాడు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని బోయపాటి రాసుకునే సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే ఎమోషనల్ సీన్స్ ను కూడా ప్రేక్షకులు హృదయాలను హత్తుకునేలా తెరకెక్కిస్తుంటారు. అఖండ సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఇక జోరుగా కొనసాగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది.

  సినిమా షూటింగ్ లో ఇటీవల బోయపాటి చేసిన ఒక మంచి పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూటింగ్ మధ్యలో వచ్చిన కోతులకు ఆయన తినుబండారాలను ఇచ్చారు. ఒక్కొక్క దానికి చేతిలో ఉన్న బిస్కెట్స్ ను అందిస్తూ వాటిని ఆప్యాయంగా వెళ్ళండి అంటూ మాట్లాడారు. దీంతో అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో బాలకృష్ణ నెవర్ బిఫోర్ అనేలా అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఈ సమ్మర్ లో నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.

  Boyapati srinu akhanda location video viral helping to monkeys

  కరోనా వైరస్ వలన వాయిదా వేయక తప్పలేదు. ఇక వచ్చే వినాయక చవితి సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పరిస్థితులు అనుకూలించే వరకు సినిమాను విడుదల చేయకూడదని చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చింది. అఖండ సినిమాలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో గ్లామరస్ రోల్స్ ఎక్కువగా చేసిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో మాత్రం సీరియస్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

  ఈ బ్యూటీ కెరీర్ మొదటి నుంచి కూడా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటోంది. కానీ అందులో కొన్ని వివిధ రకాల కారణాల వల్ల డిజాస్టర్స్ అవుతున్నాయి అయినప్పటికీ ప్రగ్యా జైస్వాల్ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇదివరకే బోయపాటి దర్శకత్వం వహించిన జయ జానకి రామ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అడుగులు వేస్తోంది. మరి అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Akhanda Cinema is also one of the most eagerly awaited movies by the audience. The rumors about the movie are going viral day by day. And now there is another talk coming that this is the movie story line. Information that Boyapati has created slightly different elevations with the same routine story as usual.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X