'సింహా' అందుకే హిట్టయింది...బోయపాటి శ్రీను
ఫైట్స్, సాంగ్స్, సెంటిమెంట్ సీన్స్, ప్యామిలీ డ్రామ్ అన్నీ కలగలిసి ఉండే కమర్షియల్ చిత్రాలు ఎప్పుడూ హిట్టే. అయితే వీటితో పాటు మారుతున్న ప్రేక్షకులుకు ఏదో కొత్తదనం ఇవ్వగలగాలి..అదే మేం సింహా లో చేసి సక్సెస్ అయ్యాం. సింహాలో ఎక్కడా పెద్ద పెద్ద లెంగ్తీ డైలాగులు లేవు..అందుకే యూత్ ఆడియన్స్ కి పట్టింది అంటున్నారు బోయపాటి శ్రీను. వరస ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు సింహాతో విజయం లభించింది. దాంతో బోయపాటికి ఎన్టీఆర్ నుంచి ఆఫర్ వచ్చింది. కె.ఎస్.రామారావు నిర్మించే ఈ చిత్రం స్క్రిప్టు ఓకే అయిందని సమాచారం. ఎన్టీఆర్ ఈ లోగా ఏ ప్రాజెక్టూ ఓకే చేయకపోతే ఈ చిత్రమే పట్టాలు ఎక్కే అవకాసం ఉంది. అయితే బోయపాటి...ఈ లోగా వెంకటేష్ కి కూడా ఓ కథ వినిపించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. బోయపాటి, వెంకటేష్ కాంబినేషన్ లో తులసి చిత్రం వచ్చింది.


Click it and Unblock the Notifications











