వారసత్వం అసమర్ధుడికి బరువు.. కేసీఆర్‌కు కేటీఆర్, చిరుకు రాంచరణ్‌ ఆ బాధ్యత.. బోయపాటి

రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ..

 నన్ను క్షమించాలని బోయపాటి

నన్ను క్షమించాలని బోయపాటి

వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈ వేడుకకు కాస్తా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. చిరంజీవి అభిమానులకు అభినందనలు. మమ్మల్ని అభినందించడానికి వచ్చిన కేటీఆర్‌కు మామే అభినందనలు తెలపుతున్నాం. ఈ వేడుకైన ఆశీర్వదించడానికి రావడానికి పెద్ద మనుషులు అవసరం లేదు. పెద్ద మనసు ఉంటే చాలు. అలాంటి వ్యక్తి కేటీఆర్. ఇది ఎవరైనా గుండె మీద వేసుకొని నమ్మొచ్చు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి

ఇక రాంచరణ్ గురించి మాట్లాడితే.. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేని వ్యక్తి. వారికి జేబులో నుంచి డబ్బులే కాదు.. కడుపులో నుంచి దేనినైనా తీసి ఇచ్చే వ్యక్తి రాంచరణ్. అలాంటి మనస్తత్వాలున్న కేటీఆర్; రాంచరణ్ మంచి స్నేహితులయ్యారనుకుంటాను.

సినీ, రాజకీయాల్లో వారసత్వం గురించి

సినీ, రాజకీయాల్లో వారసత్వం గురించి

వారసత్వం అనేది అసమర్ధుడికి బరువు. సమర్ధకుడికి ఓ బాధ్యత. రాజకీయాల్లో కేసీఆర్ వారసుడిగా, సినీ రంగంలో చిరంజీవికి వారసుడిగా రాంచరణ్ ఆ బాధ్యతను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అలాంటి సమర్ధులు ఈ వేదికపై ఉండటం ఆనందం. ఈ సినిమా వినయ విధేయ రామ టైటిల్ కేటీఆర్‌కు కూడా వర్తిస్తుంది.

చిరంజీవి సమర్ధత గురించి

చిరంజీవి సమర్ధత గురించి

ఓ సమర్ధుడు నిలబడితే వందమంది సమర్ధులను నిలబెట్టడానికి అవకాశం లభిస్తుంది. అలాంటి చిరంజీవిని చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. గతేడాది ఖైదీ నంబర్ 150తో మరోసారి తన సత్తాను నిరూపించుకొన్నారు. మీరు సినిమాలు చేసుకోవాలని అందరినీ ముందుకు తోసి తను తప్పుకొన్నాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి అందరికంటే ఎక్కువ రికార్డులు కొల్లగొట్టాడు.

రాంచరణ్ గురించి ప్రేక్షకులే

రాంచరణ్ గురించి ప్రేక్షకులే

రాంచరణ్ గురించి సినిమా చూస్తే ఆయన ఎంతటి నటుడు ప్రేక్షకులే చెబుతారు. ఈ సినిమా చూడటానికి వచ్చే చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులను ఏమాత్రం నిరాశపరచను. అందరూ గుండె మీద చేయి వేసుకొని చూడవచ్చు అనే మాట మాత్రం చెబుతాను.

హేమ పాత్ర అందరికీ దగ్గరగా

హేమ పాత్ర అందరికీ దగ్గరగా

వినయ విధేయ రామ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో హేమ చక్కటి పాత్ర పోషించింది. ఆమె పాత్ర మనకు దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో అన్నీ పాత్రలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X