»   »  బన్ని తో చిత్రం విషయమై బోయపాటికి బిగ్ రిలీఫ్

బన్ని తో చిత్రం విషయమై బోయపాటికి బిగ్ రిలీఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :బోయపాటి శ్రీను, బన్నిల కాంబినేషన్ లో రూపొందే చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో లాంచింగ్ డేట్ ని ఖరారు చేసారు. దాంతో దర్శకుడు బోయపాటి శ్రీనుకు పెద్ద రిలీఫ్ దొరికినట్లైంది అంటున్నారు.

వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొనే చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ తెరకెక్కిస్తోంది. అల్లు అరవింద్‌ నిర్మాత. ఈనెల 12న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ నెలాఖరులోగా షూటింగ్ మొదలెడతారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బన్నీ పక్కన ఇద్దరు హీరోయిన్స్ సందడి చేస్తారు. వారి పేర్లు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.

అలాగే ఈసారి యాక్షన్‌ మోతాదు కొంచెం ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే.. ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను కాబట్టి. కథానాయకుడి ధీరోదాత్తతను మరో కోణంలో చూపించే దర్శకుడు బోయపాటి. 'లెజెండ్‌'తో ఆయన పంథా మరోసారి స్పష్టమైంది. ఈసారి బన్నీతో బోయపాటి జట్టు కుదిరటం తో బన్ని అభిమానుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ .... త్వరలో తాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర్జున్‌ హీరోగా నూతన చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు తారాగణాన్ని త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

Boyapati Srinu ,Bunny movie launch date confirmed

చిత్రం వివరాల్లోకి వెళితే.. తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు. ఆ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి'.. ఇలా వరుస విజయాలతో జోరుమీదున్నాడు అల్లు అర్జున్‌. మరోసారి అన్నివర్గాల వారినీ అలరించే కథ, కథనాలతో వస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
As it is announced already, Bunny will be working under Boyapati Sreenu’s direction for his next. Produced by dad Allu Arvind on Geetha Arts banner, this film with Boyapati is going to be an action love story. According to reports, this film’s regular shooting will commence from this month.
Please Wait while comments are loading...