త్వరలో అఖండ 2.. శ్రీలీలకు గ్లామర్‌పై సూచన... Jai Balayya ఎందుకు అంటారో చెప్పిన బోయపాటి
రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రం సెప్టెంబరు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంటును శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ అతిథిగా వచ్చారు. ఇక ఈ ఈవెంటులో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మాస్ కా బాప్ రేంజు లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి.. లవర్‌బోయ్ రామ్ కాంబినేషన్ మూవీ స్కంద. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు... గ్లింప్స్ బీభత్సంగా ఎక్స్‌పక్టేషన్స్ పెంచాయి. దీంతో స్కంద మూవీ ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు శిల్పా కళా వేదికగా జరిగింది. ఇక ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు బాలయ్య పాల్గొన్నారు.

ఈ వేడుకలో బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ... జై బాలయ్య అంటూ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ స్పీచ్ మొదలు పెట్టారు. అఖండ 2 చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక జై బాలయ్య అనే పదం ఎలా వస్తోందో చెప్తాను. నేను బాలయ్య గారితో 15 సంవత్సరాలుగా ఉన్నాను. కొంత మంది వ్యక్తులు కాదు.. శక్తులు. ఆ శక్తే బాలయ్య. మేం ఓ ఆర్టిస్టును అనుకున్నాం అనుకుంటే.. వారు కొత్తగా కనిపిస్తే వారే శక్తి. ఆ శక్తే బాలయ్య. అందుకే దటీజ్ బాలయ్య్.. జై బాలయ్య. బాలయ్య గారు ఆశీర్వాదిస్తే.. అమోఘం. ఆయన ఆశీర్వదంలో మనహితంతో పాటు.. జనహితం ఉంటుంది. అందుకే జై బాలయ్య.. అంటామంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక స్కంద విషయానికి వస్తే.. ఈరోజుమంచి సినిమా చేసి.. మీ ముందుకు వస్తున్నాను. ఒక్క మాట నేను చెప్పగలను.. గుండె మీద చేయి వేసుకుని చూడండి. ఇదో అద్భుతమైన ఫ్యామిలీ. అలాగే యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ఇక హీరో పోతినేని గురించి ఓకే మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే... తపన. రామ్ అంటే ఎనర్జీ అంటారు.. ఎనర్టీ అందరిలో ఉంటారు. ఓ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా చేయాలి అనే ఇది ఉంటుంది చూడండి అదే తపన. రామ్ లో అదే ఉందన్నారు.

ఇప్పుడు ట్రైలర్ చూశారు.. రేపు సినిమాలో చూస్తారు. ఇక శ్రీలీల గురించి మాట్లాడితే.. అందరూ మాట్లాడుతున్నారు... అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్తున్నారు. ఆ అమ్మాయి అద్బుతమైన ఆర్టిస్టు. తనలో అన్ని వేరియెషన్స్ ఉన్నాయి. అవకాశం రాలేదు.. వచ్చినప్పుడు నిరూపించుకుంటుంది. ఎవరన్నా హీరోయిన్ కనిపిస్తే... ఏ హీరోతో చే్స్తున్నావ్ అంటాం. ఈ హీరోయిన్ కనిపిస్తే... ఏ హీరోతో చేయట్లేదు అని అడగాలి. అలాగే చేయ్ అమ్మా.. కీప్ ఇట్ అప్. కానీ ఎక్కువగా పరిగెడితే.. గ్లామర్ పొద్ది జాగ్రత్త. మ్యూజిక్, కెమెరమెన్ పనితనం సూపర్.
ఇక చిత్ర యూనిట్ గురించి పొగుడుతూ మాట్లాడారు. అలాగే అల్లు అర్జున్ కు, త్రిబుల్ ఆర్ కు ఆరు అవార్డులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అయ్యే ఖుషి, పొలిశెట్టి, స్కంధ, సలార్, భగవంత్ కేసరి అన్ని బాగుండాలి. తెలుగు పరిశ్రమ గెలవాలి. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అంటూ స్పీచ్ ముగించారు.


Click it and Unblock the Notifications











