అలాంటి వాళ్ల దగ్గర మా జీవితాలను తాకట్టు పెట్టలేం: బోయపాటి

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్ హిట్ అయినవే. అందుకే బోయపాటి టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమానూ చేయడం లేదు. కానీ, ఆయన శిష్యుడు అర్జున్ జంధ్యాల మాత్రం 'గుణ 369' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో 'RX100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అతడి సరసన అనఘ నటిస్తోంది. ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'గుణ 369' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందుకోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. బోయపాటితో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బోయపాటి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, సినిమా ట్రైలర్ బాగా వచ్చిందని, సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. అంతేకాదు, తన శిష్యుడు, చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Boyapati Srinu Comments On Arjun Jandhyala

ఈ కార్యక్రమంలో బోయపాటి మాట్లాడుతూ.. ''నేను 2005లో దిల్ రాజు గారి బ్యానర్‌లో 'భద్ర' అనే సినిమా చేశాను. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌లో 2007లో 'తులసి' తెరకెక్కించాను. ఈ సినిమా ద్వారానే అర్జున్ నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. నా ప్రతి సినిమాకూ పని చేశాడు. నేను ఏదైనా పని అప్పగిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోయేవాడు కాదు. పని రాని వాళ్లైతే మా జీవితాలను తాకట్టు పెట్టలేం కదా. దాదాపు 12 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఇప్పుడు డైరెక్టర్‌గా మీ ముందుకు వస్తున్నాడు. ఇతని గురించి నేను ఎక్కువగా మాట్లాడితే బాగోదు. కాబట్టి ముగిస్తున్నాను'' అంటూ దర్శకుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అలాగే ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా అవడం పక్కా అనిపిస్తుందన్నారు. హీరోయిన్ బాగుందని, ఆమె నెక్ట్స్ డోర్ హీరోయిన్‌లా కనిపిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఇతర టెక్నీషియన్లందరికీ బోయపాటి శుభాకాంక్షలు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X