భోయపాటి శ్రీను ను కన్ఫ్యూజన్ లో పెట్టిన చిరు...
యువరత్న బాలకృష్ణకు 2010లో తిరుగులేని హిట్ ఇచ్చిన భోయపాటి శ్రీనుకు మాత్రం అదృష్టం బాగున్నట్టు లేదు. ఆ సినిమా తర్వాత బోయపాటికి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా సినిమాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. జూ ఎన్టీఆర్ తో సినిమా కన్ ఫర్మ్ అయినట్టు మాత్రం తెలిసింది. కానీ, బోయపాటి చెప్పిన కథ ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో అది ఆగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి బోయపాటిని డైరెక్టర్ గా కన్ ఫర్మ్ చేసారని ఈమధ్య వార్తలు వచ్చాయి.
అయితే అది కరెక్టా కాదా అన్నది బోయపాటికి కూడా తెలీదు. తను రీ ఎంట్రీ అవుతున్న చిత్రానికి బోయపాటిని దర్శకత్వం వహించాల్సిందిగా చిరంజీవి అడిగారట. అంతవరకే జరిగింది. ఆ విషయాన్ని ఇంతవరకు కన్ ఫర్మ్ చెయ్యలేదట. ఈ చిత్రానికి కథను వేరే రచయితతో రాయిస్తున్నారు. దానికి సంబంధించిన కథా చర్చలు రోజూ జరుగుతున్నాయి. బోయపాటి మాత్రం ఇంకా కన్ ఫ్యూజన్ లోనే వున్నాడు. అతనికి ఈ సినిమా అయినా కన్ ఫర్మ్ గా వుంటుందో..లేదో..


Click it and Unblock the Notifications











