ఫేక్ ఎక్కౌంట్ తో మిస్ లీడ్ చేస్తున్నారు....బోయపాటి శ్రీను
సింహా చిత్రం ఘన విజయంతో హాట్ డైరక్టర్ గా మారిన బోయపాటి శ్రీను కి తాజాగా ఓ కొత్త తలనొప్పి పట్టుకుంది. అది ట్విట్టర్ ద్వారానని బోయపాటి మీడియా వద్ద వాపోయారు. తన పేరుతో ట్విట్టర్ లో ఓ ఫేక్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి తమ ఇష్టం వచ్చిన న్యూస్ లను పెడుతున్నారని, దాన్ని ఆపుచేయాలని, అలాగే తనకు ఏ విధమైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ తో సంభంధం లేదని, ఇంటర్నెట్ లో తానూ ఏమీ రాయనని వెల్లడించారు. అలాగే తాను ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో అనూష్కని హీరోయిన్ గా పెడ్తున్నట్లు తన పేరు మీద ఉన్న ట్విట్టర్ లో రాసారని,అది నిజం కాదని, తాను ఏదైనా జనాలకి చెప్పవలసి వస్తే మాధ్యమంగా మీడియానే ఎంచుకుంటానని స్పష్టం చేసారు. ఇక గతంలో దిల్ రాజు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆ మధ్య త్రిషకు కూడూ ఇలాంటి ఫేక్ ఎక్కౌంట్ సమస్య ఎదురైన సంగతి గుర్తుండే ఉంటుంది.


Click it and Unblock the Notifications











