#BBB బాలకృష్ణతో మల్టీస్టారర్.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మెగా హీరో.. సినిమా ఎప్పుడంటే? బోయపాటి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో హ్యాట్రిక్ సాధించారు. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో ఈ కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే మళ్లీ బాలకృష్ణతో బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడనే విషయంపై ఇప్పటి నుంచే ఆసక్తి, చర్చ మొదలైంది. అయితే బాలకృష్ణతోపాటు మెగా హీరోతో సినిమా గురించి బోయపాటి క్లారిటీ ఇస్తూ..

అఖండలో అఘోరా మేకప్ గురించి
అఖండ చిత్రంలో అఘోరా మేకప్ విషయంలో బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. తలపై జుట్టు, బాగా పెరిగిన గడ్డంతో కాకుండా మామూలుగా చూపడం వెనుక ఆయన కృషి చాలా ఉంది. నాకు బాగా జుట్టుతో, పెరిగిన గడ్డంతో చూపిస్తే ప్రేక్షకుల గుర్తు పట్టడానికి వీలు ఉండేది కాదు. అందుకే పాత్రను ఎలివేట్ చేసే విధంగా మేకప్ విషయంలో చాలా శ్రద్ద వహించాం అని చెప్పారు

అఖండ చేయడానికి ప్రధాన కారణం
సింహా, లెజెండ్ లాంటి సక్సెస్ తర్వాత మరో చిత్రం వస్తుందంటే.. ఆ సినిమాల రేంజ్‌లోనే ప్రేక్షకులు చూస్తారు. కానీ ఆ రెండు సినిమాల కంటే భిన్నంగా, కొత్త జోనర్‌లో సినిమా చేయాలన్న సంకల్పమే అఖండకు దారి తీసింది. అయితే అఖండ రిలీజ్ ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి కారణం ఆ సినిమా కంటెంట్. అఖండను ఎడారిలో వేసినా ఆడుతుందనే నమ్మకం ఉండింది అని బోయపాటి చెప్పారు.

బాలకృష్ణ, బన్నీతో బోయపాటి BBB
అయితే బాలకృష్ణ, బన్నీ (అల్లు అర్జున్) కాంబినేషన్‌లో BBB సినిమా ప్లాన్ జరుగుతున్నట్టు వచ్చిన వార్తల గురించి స్పందించాలని కోరగా.. బోయపాటి సానుకూలంగా స్పందించారు. సరైన సమయంలో ఈ సినిమా రావడానికి అవకాశం ఉంది. సరైన సందర్భంలో బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమా గురించి వెల్లడిస్తాను. అప్పటి వరకు అభిమానులు వేచి చూడాల్సిందే అని బోయపాటి అన్నారు.
డ్రీమ్ ప్రాజెక్ట్‌పై బోయపాటి శ్రీను క్లారిటీ
అఖండ తర్వాత బాలకృష్ణతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని డ్రీమ్ ప్లాజెక్ట్ ప్లాన్ చేశారు. బాలకృష్ణతో మరో స్టార్ హీరో చేయాల్సి ఉంది. కానీ స్టార్ హీరో తప్పుకోవడంతో మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి నర్బగర్భంగా స్పందించారు. సినిమా పరిశ్రమలో ఏదైనా సాధ్యమే. ఏది ఎప్పుడు జరుగుతుందనే విషయం కాలమే నిర్ణయిస్తుంది అని బోయపాటి చెప్పారు.

అఖండ సినిమాకు సీక్వెల్
అఖండ విజయం సాధించిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది. అందుకే అఖండ చిత్రంలో ఒక లీడ్ వదిలాం. తప్పకుండా అఖండకు సీక్వెల్ తీసుకొస్తాం. కానీ అది ఎప్పుడు వస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది అనేది త్వరలోనే వెల్లడిస్తాం అని బోయపాటి శ్రీను వివరించారు.


Click it and Unblock the Notifications











