మోక్షజ్ఞతో సినిమా గురించి బోయపాటి.. ఫస్ట్ మూవీనే అలా కాకూడదు!
నందమూరి బాలకృష్ణ నటించి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కానీ మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం మాత్రం ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం బాలయ్య మోక్షజ్ఞ తళుక్కున మెరిసే అవకాశం ఉందంటూ ఓ వైపు గుసగుసలు వినిపిస్తున్నా..అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బాలయ్యకు రెండు సూపర్ హిట్స్
బాలకృష్ణ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో బోయపాటి శ్రీను సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. దీనితో బోయపాటికి నందమూరి అభిమానుల్లో క్రేజ్ పెరిగింది. మోక్షజ్ఞ తొలి చిత్రానికి బోయపాటి దర్శత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపించాయి.

నేను చేయకూడదు
ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బోయపాటి మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు. తాను మోక్షజ్ఞని లాంచ్ చేయడం లేదని అన్నారు. నేను మోక్షజ్ఞ లాంచింగ్ చిత్రానికి దర్శత్వం వహించకూడదు. నేను చేస్తే అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఫస్ట్ మూవీకే ఇలా అంచనాలు పెరడడం మంచిది కాదు అని బాలయ్య తన అభిప్రాయాన్ని తెలిపారు.

శిక్షణ పొందుతున్న మోక్షజ్ఞ
మోక్షజ్ఞ ప్రస్తుతం నటన, డాన్సులు, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. మోక్షజ్ఞ అన్ని విభాగాల్లో ప్రావీణ్యం పొందిన తర్వాత తొలి చిత్రానికి సంబందించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బాలకృష్ణ మోక్షజ్ఞకు సరిపడే కథలని ఎంపిక చేస్తునట్లు కుడా వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రేపు విడుదల కానుండగా, ఎన్టీఆర్ మహానాయకుడు ఫ్రిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది బాలయ్య నుంచి మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ గురించి ప్రకటన వస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











