మహేష్ బాబు, బోయపాటి సినిమా.. మరుగున పడిపోవడానికి కారణం అదేనా!
సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భరత్ అనే నెను చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రం యూఎస్ లో మిలియన్ డాలర్ల కనక వర్షం కురిపిస్తోంది. కొరటాల శివ మహేష్ బాబుని ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేసిన విధానం, మహేష్ అద్భుత నటన, కైరా అద్వానీ గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రాన్ని విజయానికి ప్రధాన కారణాలు. ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు తదుపరి చిత్రాలపై పడింది.
మహేష్ బాబు వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా బోయపాటి శ్రీను ఆ మధ్యన మహేష్ ని కలసి కథ వినిపించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మల్టీస్టారర్ గా రూపొందుతుందని ప్రచారం జరిగింది. బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం మరుగున పడిపోయినట్లు తెలుస్తోంది.

బాలయ్య పాత్ర తన పాత్రని డామినేట్ చేసే విధంగా ఉండడంతో రిస్క్ అని భావించిన మహేష్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా మంచి కమర్షియల్ కథని సిద్ధం చేసుకుని రావాలని మహేష్ బోయపాటికి సూచించాడట. ఇప్పుడు బోయపాటి రాంచరణ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు వంశి పైడి పల్లి చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. ఇప్పట్లో మహేష్, బోయపాటి కాంబోలో చిత్రం లేనట్లే.


Click it and Unblock the Notifications











