ఏపీ అసెంబ్లీలో ‘బోయపాటి’ దుమారం.. మళ్లీ రాజుకున్న వివాదం

Recommended Video

YSRCP Slams Chandrababu And Boyapati Srinu On Godavari Pushkaralu Issue || Filmibeat Telugu

బోయపాటి శ్రీను.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు సినిమా అయిపోయిన వెంటనే మరొక దానిని పట్టాలెక్కించేసిన ఆయన.. ఆప్పుడు మాత్రం ఖాళీగా ఉంటున్నారు. గత సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ చిత్రం 'వినయ విధేయ రామ' తర్వాత బోయపాటి మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొద్దిరోజుల క్రితం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఏపీలో జరుగుతున్న సమావేశాల్లో బోయపాటి ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు.

ఏపీ అసెంబ్లీలో బోయపాటి పేరు

ఏపీ అసెంబ్లీలో బోయపాటి పేరు

‘‘డైరెక్టర్ బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్‌ చేయమని ఎవరు చెప్పారు.? బోయపాటిని చంద్రబాబు షూటింగ్‌ చేయమన్నారా..? ఆయనే సినిమా షూటింగ్‌ చేశారా..? అసలు బోయపాటి శ్రీనుకు పుష్కరాలతో ఏం సంబంధం..? దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు సమాధానం చెప్పాలి'' అని వైసీపీ సభ్యుడు వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, జక్కంపూడి రాజా ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల ఆరోపణ - మంత్రి వివరణ

ఎమ్మెల్యేల ఆరోపణ - మంత్రి వివరణ

29 మంది చనిపోయినా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదన్న ఎమ్మెల్యేలు.. భక్తులు చనిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. దీనిపై కేబినెట్‌ సబ్‌కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.

పుష్కరాల్లో షూటింగ్

పుష్కరాల్లో షూటింగ్

గతంలో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో బోయపాటి శ్రీను కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గోదావరికి పవిత్ర హారతి ఇచ్చేందుకు తయారు చేసిన స్టేజ్‌ను రూపొందించింది బోయపాటి శ్రీనే. అలాగే, తొక్కిసలాట జరిగే సమయంలో ఆయన షూటింగ్ చేయడం వివాదాస్పదం అయింది.

ప్రచారానికీ యాడ్స్ రూపకల్పన

ప్రచారానికీ యాడ్స్ రూపకల్పన

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి బోయపాటి ఎంతో సాయం చేసిన విషయం విధితమే. ఆ పార్టీ ప్రచారానికి వాడుకున్న యాడ్స్‌ను ఆయనే చిత్రీకరించారని ప్రచారం జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.

బాలయ్య, చంద్రబాబుతో సాన్నిహిత్యం

బాలయ్య, చంద్రబాబుతో సాన్నిహిత్యం

బోయపాటి మొదటి నుంచీ నందమూరి బాలకృష్ణతో సన్నిహితంగా ఉండేవారు. ఆయనతో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను చేశారు. ఈ క్రమంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరిచయం పెరగడం.. ప్రభుత్వ కార్యక్రమాలు ఆయనకు అప్పగించడం వంటివి చేశారనే టాక్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X