అఘోరాగా బాలకృష్ణ నిజమే.. చిరంజీవితో సినిమా ఎప్పుడంటే బోయపాటి శ్రీను క్లారిటీ

టాలీవుడ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. వారిద్దరి మధ్య వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ స్టామినాను చాటిచెప్పాయి. తాజాగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా సిద్ధమవుతున్నది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలో టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి మాట్లాడుతూ..

బాలకృష్ణతో మొదటి సినిమా గురించి

బాలకృష్ణతో మొదటి సినిమా గురించి

బాలకృష్ణతో సినిమా చేయాలని కొన్ని కథలు చెప్పాను. అయితే ఒకరోజు విజయవాడలో పెళ్లిలో ఉండగా నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత కలిస్తే ఓ కథ ఇచ్చి సినిమా చేయమని అడిగారు. అయితే ఐదు రోజులు సమయం తీసుకొని వెళ్లి కలిశాను. ఆ తర్వాత నేను చెప్పిన కథ విని కొన్ని ప్రశ్నలు వేశారు. అయితే మీరు ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేశారు. ఈ కథ విషయంలో నన్ను నమ్మండి. ఫలితం విభిన్నంగా ఉంటుందని చెప్పి బాలయ్యను ఒప్పించాను అని బాలకృష్ణ చెప్పాను.

సింహా, లెజెండ్ గురించి

సింహా, లెజెండ్ గురించి

నందమూరి బాలకృష్ణతో తీసిన సింహా, లెజెండ్ సినిమాలు మా కాంబినేషన్‌పై ఎనలేని అంచనాలను పెంచాయి. అయితే ఆ రెండు చిత్రాల కంటే భిన్నంగా, అంచనాలకు మంచి సినిమా ఉంటుందనేది దర్శకుడిగా నా గ్యారెంటి. బాలకృష్ణను అభిమానులు, తాను ఎలా చూడాలనుకొంటున్నానో అలానే ఉంటుంది అని బోయపాటి శ్రీను అన్నారు.

కథ ఒకే చేస్తే మళ్లీ ఆలోచించరు

కథ ఒకే చేస్తే మళ్లీ ఆలోచించరు

బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి బోయపాటి శ్రీను చెబుతూ.. దర్శకుడిని ఒక్కసారి నమ్మితే మళ్లీ దాని గురించి ఆలోచించరు. కథ, కథనాలను, ఆయన పాత్ర చిత్రీకరణపై దర్శకుడు క్లారిటీ ఇస్తే మరోసారి పట్టించుకోరు. ఏ సీన్‌నైనా మళ్లీ తీస్తే ఎందుకు తీస్తున్నారనే విషయాన్ని కూడా అడగరు. బాలకృష్ణ నూటికి నూరుశాతం డైరెక్టర్ యాక్టర్ అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.

మా మూడో సినిమా ఎలా ఉంటుందంటే..

మా మూడో సినిమా ఎలా ఉంటుందంటే..

మా కాంబినేషన్‌లో వచ్చే మూడో సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది. కొన్నిసీన్లు, ఓ ఎపిసోడ్‌ను బ్రహ్మండంగా తెరకెక్కించాం. కరోనావైరస్ కారణంగా మా షూటింగ్ వాయిదా పడింది. ఆ క్రమంలో మళ్లీ కథపై కసరత్తు చేయడంతోపాటు.. ఇతర కథలపై పూర్తిగా దృష్టిపెట్టాం. ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే ఆలోచనతో కొత్త కథలను డెవలప్ చేస్తున్నాం అని బోయపాటి శ్రీను వెల్లడించారు.

బాలకృష్ణ అఘోరాగా నటిస్తున్నారు..

బాలకృష్ణ అఘోరాగా నటిస్తున్నారు..

మా కాంబినేషన్‌లో వచ్చే మూడో సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించబోతున్నారనే వార్తలను బోయపాటి శ్రీను ధృవీకరించారు. ఆయనను అఘోరాగా చూపించబోతున్నాం. కథలో అది కీలకమైన మలుపు. ఆయన పాత్ర సరికొత్తగా ఉంటుంది. ప్రేక్షకులను థ్రిల్ చేయడం గ్యారెంటి. అలాంటి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం అని బోయపాటి శ్రీను తెలిపారు.

చిరంజీవితో సినిమా ఎప్పుడంటే..

చిరంజీవితో సినిమా ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం తప్పనసరి. అది ఎప్పుడూ ఎలా ప్రారంభం అవుతుందో అనేది చెప్పలేం. కానీ ప్రతీ దర్శకుడు చిరంజీవితో సినిమా ఎలా చేయాలి? ప్రభాస్‌తో, మహేష్ బాబుతో, ఇతర హీరోలతో ఎలాంటి చేయాలనే అంశంలో ప్రతీ దర్శకుడు కథ తయారు చేసుకొంటారు. అయితే సినిమా పరిశ్రమలో ఎప్పుడు, ఏ ప్రాజెక్ట్ ఎలా మొదలవుతుందో చెప్పలేం. కానీ చిరంజీవితో తప్పకుండా ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను అని బోయపాటి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X