బోయపాటి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ వివరాలు...
దమ్ము చిత్రాన్ని పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించి దమ్మున్న డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను....సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. బోయపాటి ఏమాత్రం సమయం వేస్ట్ చేయకుండా తర్వాతి సినిమాలకు సిద్దం అవుతున్నారు.
ఇప్పటికే ఆయన ఫిల్మ్ చాంబర్లో 'షేక్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ మేరకు ఆ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు వర్కులో ముగి పోవడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి సినిమా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్‌లతో ప్లాన్ చేసుకుంటున్నారు.
మహేష్ బాబుతో ప్లాన్ చేసుకుంటున్న సినిమాకు 'రూలర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ఇమేజ్‌కు తగిన విధంగా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రాన్ని బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
'రూరల్' అనే టైటిల్ దమ్ము చిత్రంలోని ఓ పాటలోనిది. వాస్తవానికి ఆ టైటిల్‌ను ఆ చిత్ర నిర్మాత వల్లభ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయిద్దామని అనుకున్నాడు. అయితే అంతకంటే ముందే బోయపాటి దాన్ని రిజర్వ్ చేసుకుని ఆ నిర్మాతకు షాక్ ఇచ్చాడట.


Click it and Unblock the Notifications











