అలాంటి వాళ్లకి సినిమా అస్సలు చేయను: బోయపాటి
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన చిత్రం 'సరైనోడు'. ఈ గతవారం విడుదలైన ఈ చిత్రం రిజల్ట్ గురించి తాజాగా ఇంటర్వ్యూలో బోయపాటి స్పందించారు. సూపర్ హిట్ అనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ దేవుడి దయ వల్ల ఇలాగే కంటిన్యూ అయితే బావుంటుంది. మా కష్టానికి తగిన ఫలితం ఉంటుందని బోయపాటి చెప్పుకొచ్చారు.
నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసానండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసే అవకాశం ఉండదు.. నేను తీయాలనుకున్న దానికి అభ్యంతరం చెబుతారు అనుకుంటే వాళ్లకి అసలు సినిమానే చేయను. నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను.
సరైనోడు కథ ఫైనల్ అయ్యేవరకు బన్నీ ఇన్ వాల్వెమెంట్ ఉంది...ఉండాలి కూడా. కథ ఫైనల్ అయి షూట్ స్టార్ట్ చేసానంటే ఇక వెనక్కి తిరిగి చూడను. నేను ఎవరి ఇన్ వాల్వెమెంట్ అంగీకరించను. నేను అనుకున్నది తీయగలను అనుకున్నప్పుడే సినిమా తీస్తాను అని బోయపాటి తేల్చి చెప్పారు.

నా సినిమాల్లో భద్ర తర్వాత మళ్లీ అంతలా కామెడీ బాగా పండింది 'సరైనోడు'సినిమాలోనే. బ్రహ్మానందం, విద్యులేఖ రామన్ లపై చిత్రీకరించిన కామెడీ సీన్స్ ని ఆడియోన్స్ విపరీంతగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒక తరహా సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలనే కొత్తగా చేయాలి. అయితే... ఖచ్చితంగా ట్రెండ్ మార్చాలి. సింహ తర్వాత లెజెండ్ తీసానంటే...సింహ రూట్ లోనే వెళ్లి కొత్తగా తీసాను. ఈ సినిమా సింహ లా ఉండదు. ఒకవేళ ఉంటే జనం చూడర అన్నారు బోయాపాటి.
తన తర్వాతి సినిమా గురించి బోయపాటి వివరిస్తూ... నా తర్వాతి సినిమా సాయి శ్రీనివాస్ తో ఉంటుంది. సాయి శ్రీనివాస్ ముందు సినిమా ఫ్లాప్ అయ్యింది. అతనితో ప్రయోగం చేయలేను. నాకంటూ కొంత మంది హీరోలు ఉన్నా...నేను మాట ఇచ్చాను కాబట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాను.. ఏమున్నా లేకపోయినా..మన బ్లడ్ కి ఓ నేచుర్ ఉండాలి. మనకో క్యారెక్టర్ ఉండాలి అనుకొనేవాడిని నేను. అందుచేత మాట ఇచ్చాను సినిమా తీసి ఇచ్చేస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











