గన్ను పట్టిన బోయపాటి శ్రీను
దర్శకుడు బోయపాటి శ్రీను తాజా చిత్రం దమ్ము. ఆ చిత్రంలో ఓ షాట్ కోసం ఆయన గన్ పట్టి మరీ హీరోకు చూపించి చేయిస్తున్నారు. దమ్ము చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం ఈ పోటో చూసిన ఎవరికైనా అర్దమవుతుంది. ఇక తమ చిత్రంపై బోయపాటికి చాలా నమ్మకం ఉందని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే, నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు.
అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు బోయపాటి శ్రీను. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఉగాదికి పాటల్ని విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











