రాజమౌళి వదిలేశాడు.. బోయపాటి తలదూర్చాడు.. జక్కన అసంతృప్తికి కారణం అదేనా!

Recommended Video

Rajamouli Said No To TDP || AP Elections || Filmibeat Telugu

ఏదైనా పని మొదలుపెట్టారంటే దాని అంతు చూసే వరకు నిద్రపోరని, వందశాతం ఫలితం సాధించే వరకు నిద్రిస్తారని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి సినీ వర్గాలు చెప్పుకొంటాయి. తన వల్ల కాదంటే ఎలాంటి మొహమాటం లేకుండా వదిలేస్తారనే విషయాన్ని కూడా జక్కన్న గురించి చెప్పుకొంటారు. ఒకసారి రాజకీయ నేపథ్యం ఉన్న పనిలో వేలు పెట్టి నిరాశను ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం దానికి దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఎస్ఎస్ రాజమౌళి అసంతృప్తి?

ఎస్ఎస్ రాజమౌళి అసంతృప్తి?

కొద్ది నెలల క్రితం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎస్ఎస్ రాజమౌళి పనిచేసిన సంగతి తెలిసిందే. తాను వందశాతం దృష్టి పెట్టి ఏపీ కాపిటల్ కోసం డిజైన్లు తయారు చూసి ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. కానీ వాటిని పక్కన పెట్టి వేరే డిజైన్లు ఖరారు చేయడంతో జక్కన్న అసంతృప్తికి లోనయ్యారనే వార్త మీడియాలో ప్రచారమైంది.

జక్కన్న సున్నితంగా తిరస్కరణ

జక్కన్న సున్నితంగా తిరస్కరణ

తాజాగా ఏపీ ప్రభుత్వం తమ అభివృద్ధి పనులపై ప్రకటనలను రూపొందించాలని రాజమౌళిని కోరిందట. అందుకు ఆయన నా వల్ల కాదు అని చెప్పి ఆ పనిని నుంచి తప్పించుకొన్నారట. RRR షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారనే కారణం చెప్పి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

బోయపాటి శ్రీను చేతికి ఏపీ ప్రభుత్వ పనులు

బోయపాటి శ్రీను చేతికి ఏపీ ప్రభుత్వ పనులు

దాంతో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనలను (యాడ్స్)ను తెరకెక్కించే పనిని దర్శకుడు బోయపాటి శ్రీనుకి అప్పగించారట. ప్రస్తుతం బోయపాటి ఆ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడట. గతంలో పుష్కరాల సమయంలో చంద్రబాబు పూజలను బోయపాటి తెరకెక్కించే సమయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు మృత్యువాత పడటం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ సినిమా వాయిదా

బాలకృష్ణ సినిమా వాయిదా

ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన యాడ్స్‌ను చిత్రీకరించే పనుల్లో భాగంగా బాలకృష్ణతో రూపొందించే సినిమాను కూడా కొంచెం వాయిదా వేసుకొన్నారట. ఏపీ ఎన్నికల తర్వాత బాలకృష్ణ సినిమా పట్టాలెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారం.

బాలకృష్ణ సినిమాపై క్లారిటీ

బాలకృష్ణ సినిమాపై క్లారిటీ

వినయ విధేయ రామ తర్వాత బాలకృష్ణతో సినిమాకు బోయపాటి ప్లాన్ చేశారనే వార్త మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పొలిటికల్ యాంగిల్‌లో రూపొందే సినిమాకు సంబంధించిన పీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై పూర్తి క్లారిటీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X