జూ ఎన్టీఆర్ పెళ్ళి వరకూ తను ఆగాల్సిందే..!
బాలకృష్ణ 'సింహా" చిత్రం అఖండ విజయం తదుపరి విజయదరహంతో ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీనుకి మళ్లీ నందమూరి వారసుడి తోనే మరో చిత్రం చేసే అవకాశం రావటంతో ఎగిరి గంతేసి ఒప్పుకున్న విషయం తెల్సిందే. జూ ఎన్టీఆర్ హీరోగా నటించే ఈ చిత్రం కోసం ఇప్పటికే దాదాపు స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న బోయపాటి, దానిని ఈ మద్య ఎన్టీఆర్ కి వినిపించి ప్రశంసలందుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ శక్తి, బృందావనం చిత్రాల్లో బిజీబిజీగా ఉండటం దసరా నాటికైనా షూటింగ్ ప్రారంభించాలనుకున్న బోయపాటి పెళ్లి తరువాత కానీ ఈ చిత్రం వైపు దృష్టి సారించలేనని చెప్పడంతో ఎన్టీఆర్ పెళ్లెప్పుడవతుందా..?అని ఎదురు చూపులు చూస్తూ..తన స్ర్కిప్ట్ కి మరింత పదును పట్టే పనిలో ఉన్నాడట. అన్నట్టు బోయపాటి ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మాత.
జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను సింహా బాలకృష్ణ శక్తి బృందావనం కెఎస్ రామారావు jr ntr boyapati srinu simha balakrishna shakti brindavanam ks ramarao


Click it and Unblock the Notifications