బోయపాటి దర్శకత్వంలో ప్రభాస్

ఆయన బాలయ్యతో 'రూలర్' సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రొగ్రెస్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ.... ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఓ కథను రెడీ చేసుకుంటున్నాడట బోయపాటి. ఆయనతో చేయడానికి ప్రభాస్ కూడా సుముఖంగానే ఉన్నాడని సమాచారం.
నవీన్ ఎర్నేని ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 'బహుబలి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం అనంతరం బోయపాటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
'బహుబలి' సినిమా వివరాల్లోకి వెళితే... ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. . ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియాపై రాఘవేంద్రరావు, శోభు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది.


Click it and Unblock the Notifications











