For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ban Adipurush : ముదురుతున్న ఆదిపురుష్ వివాదం.. బ్యాన్ చేయాలని అయోధ్య ప్రధాన పూజారి డిమాండ్

  |

  రోజురోజుకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కాంట్రవర్సీ ముదురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టకున్న డార్లింగ్ ఫ్యాన్స్ టీజర్ రిలీజ్ తో ఊహించని విధంగా షాక్ అయ్యారు. ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన టీజర్ పై నెగెటివ్ కామెంట్స్ రావడమే కాకుండా వివాదస్పదం అవుతోంది. ఈ టీజర్ పై నెటిజన్లు మీమ్స్ తో ఆడుకుంటే.. రాజకీయ వేత్తలు సైతం విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి కూడా ఈ టీజర్ పై స్పందించారు. ఆదిపురుష్ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

  సరయు నది ఒడ్డున..

  సరయు నది ఒడ్డున..

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతోమంది రామ భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఇటు టాలీవుడ్ తోపాటు అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఈ సినిమా నుంచి ఒక్క అప్ డేట్ అయిన వస్తే చాలు అనుకున్న వాళ్లు అనేకం. ఈ క్రమంలోనే ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో సరయు నది ఒడ్డున విడుదల చేశారు.

  తారా స్థాయికి అంచనాలు..

  తారా స్థాయికి అంచనాలు..

  అయితే టీజర్ తప్పకుండా సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తుంది అనుకుంటే ఊహించిన విధంగా నిరాశపరిచింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం, రామాయణం బ్యాక్ డ్రాప్, రాముడిగా ప్రభాస్, రావాణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ అనేసరికి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను ఆదివారం రోజు విడుదల చేయగా ప్రేక్షకుల ఒక్కసారిగా షాక్ అయ్యారు.

   అల్లా ఉద్దీన్ ఖిల్జీలా ఉన్నాడంటూ..

  అల్లా ఉద్దీన్ ఖిల్జీలా ఉన్నాడంటూ..

  కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. అది అక్కడితో ఆగుతుంది అనుకుంటే ఆ తర్వాత రాజకీయ వేత్తలు ఈ టీజర్ పై విమర్శలు గుప్పించారు. రామాయణంపై రీసెర్చ్ చేశారా.. రావణుడి పాత్రను అలా చిత్రీకరించడం ఏంటి, రావణుడు బ్రహ్మాణుడికి బదులు అల్లా ఉద్దీన్ ఖిల్జీలా ఉన్నాడంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.

  ఆ సీన్లను వెంటనే తొలగించాలి..

  ఆ సీన్లను వెంటనే తొలగించాలి..

  అంతేకాకుండా సినిమాలోని హనుమాన్ పాత్రలో కనిపించిన దేవదత్త విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నారోత్తం మిశ్రా లేఖ రాసినట్లు చెప్పుకొచ్చాడు. టీజర్ లో హనుమాన్ లెదర్ క్లాత్ వేసుకోవడం వంటి తదితర సీన్లు మత మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డైరెక్టర్ ఓం రౌత్ ను కోరినట్లుగా ఆయన తెలియజేశారు. సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమే అని స్పష్టంగా తెలిపారు.

  రామాలయం ప్రధాని పూజారి ఆగ్రహం..

  రామాలయం ప్రధాని పూజారి ఆగ్రహం..

  ఇక తాజాగా ఈ సినిమా టీజర్ పై ఏకంగా అయోధ్యలోని రామాలయం ప్రధాని పూజారి సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో వార్షిక విజయ రథయాత్రకు హాజరైన ఆయన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడి వర్ణన భిన్నంగా ఉందని, ఇతిహాసానికి ఇది ఏమాత్రం పొంతన లేదని అన్నారు. ఈ టీజర్ అంతా వారి గౌరవానికి భంగం కలిగేలా ఉందన్నారు. అలాగే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు.

  సినిమాలు తీయడం నేరం కాదు..

  సినిమాలు తీయడం నేరం కాదు..

  మరోవైపు శస్త్ర పూజకు హాజరైన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కూడా ఈ టీజర్ ను తప్పుబట్టారు. ''సినిమాలు తీయడం నేరం కాదు. అయితే ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించి పేరు తెచ్చుకోవాలని చూడటం కరెక్ట్ కాదు'' అని తెలిపారు. కాగా త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీతో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అదేమీ అంత క్వాలిటీతో లేదు అని అసలు చిన్న పిల్లలు చూసే బొమ్మల తరహాలో గ్రాఫిక్స్ ఉంది అని ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ సినిమా కోసం నిజంగానే 500 కోట్లు ఖర్చుపెట్టారా అనేక రకాలు ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు.

  English summary
  Prabhas Kriti Sanon Saif Ali Khan Starrer Movie Adipurush Movie Getting More Controversy. Latestly Ayodhya Ram Temple Head Priest Satyendra Das Call For Ban Adipurush.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X