Pushpa: రిలీజ్‌కు ముందు పుష్పకు బిగ్ షాక్.. తెలుగు విషయంలో వివాదం.. ఇదే జరిగితే నష్టాలు తప్పవు!

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో 'పుష్ప' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ మూవీ పాటలు, టీజర్, ట్రైలర్‌లతో నేషనల్ రేంజ్‌లో సత్తా చాటుతోంది. అందుకే అన్ని ఇండస్ట్రీలూ ఈ మూవీపై దృష్టి సారించాయి. అలాగే, సినీ ప్రియులు ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు. ఇక, వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'పుష్ప'కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. వివాదం చెలరేగడంతో ఈ మూవీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్

‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

రెండు భాగాలు... పుష్ప ద రైజ్ రెడీ

రెండు భాగాలు... పుష్ప ద రైజ్ రెడీ

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శన కానున్నాయి.

భారీ స్థాయిలో బిజినెస్.. రికార్డులతో

భారీ స్థాయిలో బిజినెస్.. రికార్డులతో

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

గ్రాండ్ రిలీజ్... అన్ని చోట్లా అలాగే

గ్రాండ్ రిలీజ్... అన్ని చోట్లా అలాగే

'పుష్ప' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని ప్రాంతాలనూ కలుపుకుని దీన్ని దాదాపు 3000లకు పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో ఈ మూవీకి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయన్న ట్రేడ్ పండితులు అంటున్నారు.

రిలీజ్‌కు ముందు పుష్పకు బిగ్ షాక్

రిలీజ్‌కు ముందు పుష్పకు బిగ్ షాక్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మూవీకి వరుసగా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటోంది. దీంతో ఈ సినిమా మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారీ చిత్రానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ సారి 'పుష్ప రాజ్'కు కర్నాటక రాష్ట్రంలో ఓ భారీ చిక్కు వచ్చి పడింది.

తెలుగు విషయంలో వివాదం స్టార్ట్స్

తెలుగు విషయంలో వివాదం స్టార్ట్స్

'పుష్ప' మూవీని ఐదు భాషల్లో రూపొందించిన విషయం తెలిసిందే. కానీ, కర్నాటకలో మాత్రం ఈ చిత్రాన్ని కన్నడ భాషలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆ రాష్ట్రం మొత్తంలో కన్నడ భాషలో కేవలం 8 షోలు, అదే తెలుగులో మాత్రం దాదాపు 800 షోలు వేస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని బహీష్కరించాలని కన్నడీగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే జరిగితే నష్టాలు తప్పవు అంటూ

ఇదే జరిగితే నష్టాలు తప్పవు అంటూ

కర్నాటకలో కన్నడ భాషలోనే 'పుష్ప'ను ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు #BoycottPushpaInKarnataka అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు, తమ భాషను చించపరిచారంటూ యూనిట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఈ సినిమాకు కన్నడంలో కష్టాలు మొదలయ్యాయి. ఇదే కంటిన్యూ అయితే నష్టాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X