వీడియోలు, ఫోటోలతో బాయ్ ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్: పోలీసులను ఆశ్రయించిన నటి
తమిళ టీవీ నటి నీలాని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొత్త బాయ్ ఫ్రెండ్ మంజునాథ్ తన ఇంటిమేట్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. అతడి నుంచి తనకు, పిల్లలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, అతడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
తమిళంలో నటిగా పాపులర్ అయిన నీలాని... తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య తమిళనాడులో జల్లికట్టు ఆందోళన సందర్భంగా పోలీస్ డ్రెస్సులో వీడియో రిలీజ్ చేసి చర్చనీయాంశం అయిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్ మీద బయటకు వచ్చింది.

మొదటి బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య
గతంలో నీలానీ... గాంధీ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించింది. ఏమైందో తెలియదు కానీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీలాని అతడితో విడిపోవడం వల్లనే గాంధీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వార్తలతో కలత చెందిన నీలానీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.

మంజునాథ్ అనే వ్యక్తితో ప్రేమాయణం
కొన్ని రోజులుగా నీలాని మంజునాథ్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. మంజునాథ్ అసలు స్వరూపం తెలిసి కొన్నిరోజుల క్రితం విడిపోయింది. అప్పటి నుంచి అతడు తన ఇంటిమేట్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

9 నెలల క్రితం పరిచయం
9 నెలల క్రితం విదేశాల్లో పని చేస్తున్న మంజునాథ్ పరిచయం అయ్యాడని, తనతో పాటు ఇద్దరు పిల్లలను బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడని తెలిపింది. అయితే కొన్ని రోజుల తర్వాత మంజునాథ్ అసలు స్వరూపం తెలిసిందని, అతడికి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని తెలిసి దూరంగా ఉంటున్నట్లు నీలాని తెలిపారు.

నన్ను, నా పిల్లలను చంపుతానంటున్నాడు
మంజునాథ్‌కు దూరంగా ఉంటున్నా... అతడు మాత్రం తనను వదలడం లేదని, తన వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, నన్ను, నా పిల్లలను చంపుతానని బెదిరిపస్తున్నాడని, అపరిచితులకు నా ఫోన్ నెంబర్ ఇచ్చి వారితో తిట్టిస్తున్నాడని నీలాని ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications











