నాగ్ తో రిలేషన్ పై టబు

తాజాగా ఫిల్మ్ ఫేర్ కిచ్చిన ఇంటర్వూలో ఈ టాపిక్ పై మాట్లాడుతూ..నాగార్జున తో నా రిలేషన్ గురించి గత ఇరవై సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు...వారికి ఏం చెప్పను..అయినా నాగార్జున నన్ను ఇంతకాలం భరిస్తున్నాడు...అతనో స్పెషల్ పర్శన్..అంది..అది విన్న వాళ్ళు ముక్కున వేలు వేసుకున్నారు. టబు ఇంత బహిరంగంగా నాగ్ తో తన అనుబంధాన్ని ఒక్కసారిగా బయిటపెడ్తుందనుకోలేదు. అయితే అది ఇంగ్లీష్ పత్రక కావటం, బాలీవిడ్ కే ఎక్కువ పరిచయం ఉన్న పత్రిక కావటంతో తెలుగు పరిశ్రమలో ఎక్కువ పబ్లిసిటీ కాలేదు.
గతంలో కూడా కాఫీ విత్ కరణ్ అనే టీవీ పోగ్రామ్ లో కూడా టబు దర్శకుడు కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..తనకు నాగార్జునకి ఉన్న రిలేషన్ షిప్ ని వివరించింది. నేను తరుచుగా హైదరాబాద్ వెళ్తూంటాను..అందరూ నాగ్ కోసమే వెళ్తున్నానని మాట్లాడుకుంటున్నారు..అయితే నాకు అక్కడో సొంత ఇల్లు ఉంది..స్నేహితులు ఉన్నారు..అయినా నేను ఇప్పటికీ హైదరాబాద్ వాసిగానే భావిస్తాను..నాకు భాయ్ ప్రెండ్స్ లేరని అనను..అయితే భాయ్ ప్రెండ్స్ వచ్చారు..వెళ్ళారు..అయినా నాగార్జున మాత్రం మిగిలిపోయాడు..అతని గురించి నేనేం చెప్పను..అతను నా జీవితానికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి..అతనితో నా రిలేషన్ అమూల్యమైనది...దానికి ప్రత్యేకమైన లేబుల్ పెట్టలేదు..దాని గురించి ఎక్కువ మాట్లాడలేను..ఏమీ చేయలేను అని స్పష్టం చేసింది.ఇప్పుడేమో ఇలా చెప్పుకొచ్చింది.అదీ సంగతి..


Click it and Unblock the Notifications











