జూ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మ కడలి బర్త్‌డే (ఫోటో)
హైదరాబాద్ : జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈచిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న బ్రహ్మ కడలి పుట్టిన రోజును(ఆగస్టు 19) పురస్కరించుకుని సెట్లోనే ఎన్టీఆర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ బ్రహ్మ కడలి తన ట్విట్టర్లో ఫోటో పోస్టు చేసారు.
రామయ్యా వస్తావయ్యా సినిమా వివరాల్లోకి వెళితే....ఈచిత్రం షూటింగ్ ఆగస్టు 26 నుండి స్పెయిన్లో జరిపేందుకు రంగం సిద్దమైంది. తమన్ ఆడియో కంపోజింగ్ పూర్తి చేయడంతో అందులోని రెండు సాంగులను స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ రెండు సాంగులు ప్రేక్షకులకు నయనానందకరంగా అద్భుతమైన డాన్స్ స్పెప్పులతో పాటు, రొమాంటిక్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
బాద్‌షా తర్వాత ఎన్టీఆర్, గబ్బర్‌సింగ్ తర్వాత హరీశ్ శంకర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











