25 ఏళ్ల అమ్మాయితో బ్రహ్మాజీ రొమాన్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ఓ ఫేక్ న్యూస్ ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బతికి ఉన్న వ్యక్తిని చంపేస్తారు.. సంబంధంలేని వ్యక్తులకు రిలేషన్‌ను అంటగడుతుంటారు.. ఇక సినిమాలు, స్క్రిప్ట్‌లు, హీరో, హీరోయిన్ల విషయంలో అయితే లెక్కలేనన్ని రూమర్లు పుట్టుకొస్తాయి. అయితే వీరిలో కొందరు మాత్రం బహిరంగంగా ఖండిస్తుంటారు. ఇంకొందరు లైట్ అంటూ ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తుంటారు. మరికొందరు వారికి సెటైర్లు వేసి నోర్మూయించే పని చేస్తుంటారు.

తాజాగా బ్రహ్మాజి కూడా అదే విధంగా సెటైర్లు వేశాడు. మామూలుగానే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ డైరెక్టర్లు, హీరోలు, తోటీ నటీనటులకు కౌంటర్లు వేస్తుంటాడు. అయితే తనపై వచ్చిన రూమర్లపై బ్రహ్మాజీ వేసే సెటైర్లు అందర్నీ ఆకర్షిస్తాయి. తాజాగా తనపై వచ్చిన ఓ రూమర్‌పై స్పందించాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయబోతోన్నట్టు అందులో యాభై యేళ్ల వ్యక్తిగా బ్రహ్మాజీ నటించనున్నట్టు.. అతనికి జోడీగా 25 యేళ్ల అమ్మాయి కూడా ఉంటుందని రాసుకొచ్చారు.

Brahmaji And Rahul Ravindran Conversation Goes Viral

ఇక వీటిపై నేరుగా రాహుల్ రవీంద్రన్‌నే అడిగేశాడు. రాహుల్ బ్రో.. ఎప్పుడు స్టార్ట్ చేయబోతోన్నావ్.. హీరోయిన్ ఎవరు? అంటూ సెటైర్ వేశాడు. దీనికి రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. హహ వారు ఏదైనా రాస్తారు.. కనీసం చెక్ కూడా చేయరు.. నా దగ్గరైతే స్క్రిప్ట్ లేదు. వీళ్లే అది కూడా రాసేస్తే బాగుంటుంది అని కౌంటర్ వేశాడు. కానీ రాహుల్ రవీంద్రన్ ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడని తెగ వార్తలు వస్తున్నాయి. హీరోగా ఉన్న రాహుల్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరాడు. మళ్లీ మెగా ఫోన్ పట్టుకుని చిలసౌ వంటి చక్కటి చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే మన్మథుడు 2 వంటి నాసిరకమైన చిత్రంతో రాహుల్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు.

Brahmaji And Rahul Ravindran Conversation Goes Viral

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X