టాలెంట్ బాగా ఉందట.. నటుడిని తొక్కేయాలంటోన్న బ్రహ్మాజి

ఓ చిన్న సినిమా అందర్నీ ఆకర్షించాలంటే ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథ, కథనాలు కొత్తగా ఉండాలి, లేదా బోల్డ్ కంటెంట్‌ను నమ్ముకోవాలి. అయితే కలర్ ఫోటో చిత్రయూనిట్ మాత్రం కథను నమ్ముకుంది. టీజర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీల్ ప్రతినాయకుడిగా నటిస్తుండటం, అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్‌కు భారీ స్పందన రావడం కలిసి వచ్చింది. అయితే నిన్న విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులనే కాదు సెలెబ్రిటీలను కూడా బాగానే ఆకర్షించింది.

మరీ ముఖ్యంగా సుహాస్ యాక్టింగ్, చాందినీ చౌదరి అందాలు, సునీల్ ఆహార్యం, నటనా అందర్నీ మెప్పించింది. ఇక హీరోగా నటించిన సుహాస్‌పై చాలా మంది కళ్లు పడ్డాయి. ఇంత వరకు హీరోల పక్కన ఫ్రెండ్ పాత్రల్లో నటించిన సుహాస్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ టీజర్ మొత్తంలో ఎక్కువ మార్కులు సుహాస్‌కే పడ్డాయి. ఇదే విషయాన్ని వెన్నెల కిషోర్ చెప్పగా.. బ్రహ్మాజీ ఓ కౌంటర్ వేశాడు.

Brahmaji Counter On Suhas About Color Photo Teaser

కలర్ ఫోటో టీజర్‌ను వీక్షించిన వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో స్పందించాడు. చూడటానికి కాస్త ఆలస్యమైంది.. ఎంతో స్వీట్, ఫీల్ గుడ్‌లా ఉంది. నిర్మాత సాయి రాజేష్‌ పట్ల ఎంతో సంతోషంగా ఉంది..ఈ మొదటి చిత్రం డైరెక్టర్ సందీప్ రాజ్‌కు విజయాన్ని చేకూర్చాలి.. సుహాస్ తన ట్రెండింగ్ నటనతో ఫైర్ మీదున్నాడు. చాందినీ, సునీల్ సార్, వైవా హర్ష అందరూ బాగా చేశారు అని ప్రశంసలు కురిపించాడు. ఇక వెన్నెల కిషోర్ ట్వీట్‌కు బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ.. అన్నీ బాగున్నాయ్. . కాకా.. ఈ సుహాస్ ని తొక్కేయాలి.. ఫుల్ టాలెంట్ ఉంది.. లేకపోతే మనకే డేంజర్ అంటూ ఫన్నీగా స్పందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X