twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా బాధనిపించింది.. చిరంజీవిని ఏమన్నా అంటే చంపేస్తాం: బ్రహ్మాజీ ఎమోషనల్ కామెంట్స్

    |

    మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చంపేస్తాం అంటూ బహిరంగ వేదికపై హెచ్చరించారు నటుడు బ్రహ్మాజీ. తన కొడుకు సంజయ్ హీరోగా పరిచయం కాబోతున్న 'ఓ పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మాజీ. చిరంజీవి గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన చేసిన కామెంట్స్ మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చాయి. వివరాల్లోకి పోతే..

    ‘ఓ.. పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ చిరంజీవి

    ‘ఓ.. పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ చిరంజీవి

    టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ'. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించారు. విశ్వంత్‌, నిత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 6న ప్రేక్షకుల ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం (మార్చి 1) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై సందడి చేశారు.

    మెగాస్టార్ చిరంజీవిపై బ్రహ్మాజీ అభిమానం

    మెగాస్టార్ చిరంజీవిపై బ్రహ్మాజీ అభిమానం

    ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన బ్రహ్మాజీ చాలా ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడిస్తూ.. ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు ఎందుకు వచ్చిందో తెలిపారు. చిత్ర షూటింగ్ సమయంలో చిరంజీవి డెడికేషన్ ఎలా ఉంటుంది? ఆన్ లొకేషన్‌లో ఆయన ప్రవర్తన ఏంటి? తదితర విషయాలు చెప్పారు బ్రహ్మాజీ.

    చిరంజీవి ఏకాగ్రత.. బ్రహ్మాజీ వివరణ

    చిరంజీవి ఏకాగ్రత.. బ్రహ్మాజీ వివరణ

    మెగా అభిమానులందరికీ నమస్కారం. అన్నయ్య గురించి మీకు తెలియని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా అంటూ తన ప్రసంగం స్టార్ట్ చేసిన బ్రహ్మాజీ.. సైరా నరసింహా రెడ్డి షూటింగ్ సమయంలోని విశేషాలు, పని పట్ల చిరంజీవి ఏకాగ్రతకు సంబంధించిన విషయాలు వివరించారు. అన్నయ్య, అన్నయ్య అంటూ స్పీచ్ చివర్లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు బ్రహ్మాజీ.

    నా కొడుకు సినిమాకు ఇండస్ట్రీ అండ

    నా కొడుకు సినిమాకు ఇండస్ట్రీ అండ

    ''నా కొడుకు సినిమాకు ఇండస్ట్రీలోని చాలా మంది వచ్చి సాయం చేశారు. ఫస్ట్‌లుక్, ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్‌కి చాలా మంది గెస్ట్‌లుగా వచ్చి మా వాడిని ఆశీర్వదించారు. ఇప్పటివరకు సినిమాకు వచ్చిన హైప్ బాగానే ఉంది. కానీ ఒక్క ఈవెంట్ మిగిలిపోయింది. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ వేడుకకు నా దేవుడు చిరంజీవి అన్నయ్యను పిలిచి మరింత హైప్ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది'' అని బ్రహ్మాజీ చెప్పారు.

    అన్నయ్య హ్యాండ్ బాగుంటుంది కాబట్టి..

    అన్నయ్య హ్యాండ్ బాగుంటుంది కాబట్టి..

    అన్నయ్య చిరంజీవి షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో నా కొడుకు కోసం రండి అన్నయ్యా అని అడగాలంటే భాధనిపించింది. అయినా అడిగా. అన్నయ్య హ్యాండ్ బాగుంటుంది కాబట్టి.. మా సినిమా హిట్ అయినట్లే. మొన్న ‘అర్జున్ సురవరం' అనే సినిమాకు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఆగిపోతుంది అనుకున్న సినిమాపై అన్నయ్య హ్యాండ్ పడటంతో అది సూపర్ హిట్ అయ్యిందని బ్రహ్మాజీ అన్నారు.

    Recommended Video

    Mahesh Babu In An Aggressive Role In Chiru 152 | Megastar Chiranjeevi | Koratala Siva
     అన్నయ్యను ఎవరైనా ఏమన్నా అంటే చంపేస్తాం..

    అన్నయ్యను ఎవరైనా ఏమన్నా అంటే చంపేస్తాం..

    అన్నయ్య చిరంజీవి ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. వారందరికీ అన్నయ్య చెట్టులాంటివారు. ఈ చెట్టు వారికే కాదు నాలాంటి చిన్నవాళ్లకు కూడా నీడనిస్తుంది. ఓసారి అన్నయ్య నాతో ఓ మాటన్నారు. ''మీరు బాగుంటే నేను పట్టించుకోను రా. కానీ మీకు ఏదైనా సమస్య వస్తే నేనుంటాను'' అని. అలాంటి అన్నయ్యను ఎవరైనా ఏమన్నా అన్నా, బ్యాడ్‌గా మాట్లాడినా ఉరుకోము.. చంపేస్తాం అంటూ వేదికపైనే ఎమోషనల్ అయ్యాడు బ్రహ్మాజీ.

    English summary
    O Pitta Katha pre release event done at Hyderabad. Chiranjeevi attended as chief guest. Actor Brahmaji atracted with his speech in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X