twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్ సిట్టింగ్ వేద్దామన్నారు.. వెంటనే తారక్ అలా అనడంతో.. ఆ సాయంత్రం..: బ్రహ్మాజీ

    |

    Recommended Video

    మోహన్ లాల్ సిట్టింగ్ అన్నారు.. కానీ తారక్, విడాకులు తీసుకున్నాకే పెళ్లి ?

    బ్రహ్మాజీ.. పలానా పాత్ర అని కాకుండా.. దాదాపుగా అన్ని పాత్రల్లోనూ ఇట్టే ఇమిడిపోయే నటుడు. గతేడాది వచ్చిన ఓ సినిమాలో హీరో తండ్రిగానూ కనిపించాడు. యాభై పదుల వయసులోనూ ఆయనలో అసలా ఛాయలే కనిపించకపోవడం విశేషం. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడగల ఫిట్‌నెస్ ఆయనది. ఇటీవల ఓ ప్రముఖ టీవి చానెల్‌లో కమెడియన్ అలీతో ఆయన సాగించిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

     చెన్నైలో ఎప్పుడు అడుగుపెట్టారు?

    చెన్నైలో ఎప్పుడు అడుగుపెట్టారు?

    హైదరాబాద్ మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్ల యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి.. ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయా..

     చెన్నైలో మీ బ్యాచ్ గురించి:

    చెన్నైలో మీ బ్యాచ్ గురించి:

    అచ్యుత్, శివాజీరాజా, ఆహుతి ప్రసాద్, రామ్ జగన్, కిషోర్ వీళ్లందరూ నాకంటే సీనియర్స్. పాండి బజార్ ఏరియాలోనే ఉండేవాళ్లు. నా బ్యాచ్‌లో సూర్య, చిట్టిబాబు నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం.

    స్ఫూర్తినిచ్చిందెరు?:

    స్ఫూర్తినిచ్చిందెరు?:

    నేను కృష్ణగారికి వీరాభిమానిని. అయితే సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి అని కాదు. మా నాన్న తహసీల్దార్‌గా పనిచేసే రోజుల్లో 'శంకరాభరణం' విడుదలైంది. సోమయాజులు గారికి సన్మానం చేద్దామని ఏలూరు తీసుకొచ్చారు.

    మా నాన్న ఆఫీసర్‌ కావడంతో స్టేజి‌పైన నిలబడి చూసే అవకాశం చిక్కింది. అందరూ అభిమానంతో ఆయన కాళ్లపై పడుతున్నారు. అది చూశాక నటుడైతే ఇంత పాపులరాటీ వస్తుందా! అనుకున్నాను.

     కృష్ణవంశీతో పరిచయం..:

    కృష్ణవంశీతో పరిచయం..:

    చెన్నైలో నేనూ, కృష్ణవంశీ రూమ్ మేట్స్. పరిచయమైన కొత్తలో మాత్రం వేర్వేరుగానే ఉండేవాళ్లం. పాండిబజార్‌లో సాయంత్రం పూట కలుసుకునేవాళ్లం. 'శివ' సినిమాకు కృష్ణవంశీ అసిస్టెంట్ దర్శకుడిగా చేరాడు. అదే సినిమాలో నేను కూడా నటించడంతో మా ఇద్దరి మధ్య పరిచయం బలపడింది. ఆ తర్వాత రూమ్ మేట్స్ అయ్యాం.

    నాలుగేళ్లు తిప్పించుకున్న డైరెక్టర్ ఎవరు?

    నాలుగేళ్లు తిప్పించుకున్న డైరెక్టర్ ఎవరు?

    రవి రాజా పినిశెట్టి. నాకు ఛాన్స్ ఇవ్వవద్దనేది ఆయన ఉద్దేశం కాదు. నాకు అవకాశం దొరకలేదంతే. ఎప్పుడూ కలిసేవాడిని. చాలా మర్యాదగా మాట్లాడేవారు. మొదట్లో అవకాశం ఇవ్వకపోయినా... ఎట్టకేలకు రాజశేఖర్‌గారు నటించిన 'మా అన్నయ్య'లో మంచి పాత్ర ఇచ్చారు. దానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది.

    రవితేజతో పరిచయం గురించి:

    రవితేజతో పరిచయం గురించి:

    రవితేజ చెన్నైలోనే పరిచయం. అయితే ముఖ పరిచయమే తప్ప అంతగా టచ్ లేదు. 'నిన్నే పెళ్లాడుతా' సినిమాలో తను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పుడు బాగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘సింధూరం'లో చేశాం. ఇప్పటికీ మేమిద్దరం బాగానే ఉన్నాం.

    సిట్టింగ్.. తారక్ సలహా:

    సిట్టింగ్.. తారక్ సలహా:

    జనతా గ్యారేజ్ చివరి రోజు షూటింగ్ అప్పుడు మోహన్ లాల్ గారు ఒక మాటన్నారు. 'అందరం కలిసి పనిచేశాం. మంచి టీమ్‌ను మిస్‌ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నా. ఎక్కడైనా కూర్చుందాం' అన్నారు. వెంటనే తారక్.. బ్రహ్మాజీ ఇల్లు అయితే బాగుంటుందని సూచించారు. అలా ఆ సాయంత్రం కలిశాం.

     కొడుక్కి పెళ్లి చేశావు.. ఇంకా గ్లామర్ గానే కనిపిస్తున్నావ్?

    కొడుక్కి పెళ్లి చేశావు.. ఇంకా గ్లామర్ గానే కనిపిస్తున్నావ్?

    పాజిటివ్ థింకింగ్.. అంతే. కొంచెం క్రమశిక్షణతో ఉండటం, ప్రతీ దానికి కుంగిపోయి ఏడిస్తూ ముఖం పాడైపోతుంది. పాజిటివ్ గా ఉంటే ఇలా ఉంటుంది.

     మీ పెళ్లి గురించి:

    మీ పెళ్లి గురించి:

    మాది లవ్ మేరేజ్.చెన్నైలో ప్రేమించుకుని హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నాం. ఆవిడ బెంగాలీ. ఆమెకు సెకండ్ మేరేజ్ కావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు. 'చంద్రలేఖ' షూటింగ్ సమయంలో ఇండస్ట్రీలోని సన్నిహితులే మా పెళ్లి చేశారు. కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రామ్‌ప్రసాద్‌గారు, గుణ్ణం గంగరాజు వీళ్లంతా పెళ్లి పెద్దలు. ఆమె విడాకులు తీసుకున్నాకే మేం పెళ్లి చేసుకున్నాం.

    English summary
    Actor Brahmaji gave an interview to comedian Ali in an popular tv channel. Brajmaji said about his film journey and his personal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X