twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YS Jagan: వైఎస్ జగన్‌పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ పోస్ట్.. వైఎస్సార్ పేరును వాడుతూ ఊహించని విధంగా!

    |

    కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. 2020లో ఒకసారి, 2021లో మరోసారి లాక్‌డౌన్లు పెట్టడం వల్ల సినిమా థియేటర్లు అన్నీ మూత పడిపోయాయి. దీంతో చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఆగిపోయాయి. ఇలా పరిశ్రమకు చాలా నష్టాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. దీంతో పరిశ్రమ క్రమంగా సర్ధుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల వివాదం మరో తలనొప్పిగా మారిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఏపీ సీఎం జగన్‌పై ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

    టికెట్ రేట్లను తగ్గిస్తూ.. జీవో జారీ

    టికెట్ రేట్లను తగ్గిస్తూ.. జీవో జారీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను కొన్ని థియేటర్లు దోచుకుంటున్నాయని, ప్రతి ఒక్కరికీ వినోదాన్ని తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. రాష్ట్రంలోని థియేటర్లలో ఏరియాను బట్టి రేట్లను నిర్ణయించారు. ఆ ధరలకే టికెట్లు అమ్మాలని కఠినంగా పేర్కొన్నారు.

    Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

    కోర్టులో పిటీషన్.. మినహాయింపు

    కోర్టులో పిటీషన్.. మినహాయింపు

    ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ ధర పెంచుకునే అధికారం కల్పించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీంతో పిటీషనర్లకు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునే వెసలుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చింది.

    డివిజన్ బెంచ్‌కు ఏపీ ప్రభుత్వం

    డివిజన్ బెంచ్‌కు ఏపీ ప్రభుత్వం

    టికెట్ ధరల నియంత్రణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిగిన సమయంలో థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని హైకోర్టు సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. తదుపరి విచారణను గురువారానికి మార్చింది.

    Bigg Boss Winner: సన్నీ గెలుపుపై సరయు సంచలన పోస్ట్.. ఆ కంటెస్టెంట్‌కు అన్యాయం చేశారంటూ!Bigg Boss Winner: సన్నీ గెలుపుపై సరయు సంచలన పోస్ట్.. ఆ కంటెస్టెంట్‌కు అన్యాయం చేశారంటూ!

    ఏపీ దాడులు.. థియేటర్లు మూసి

    ఏపీ దాడులు.. థియేటర్లు మూసి

    పెంచిన టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జేసీల పర్మీషన్ తీసుకోని, సరైన నిబంధనలు పాటించని థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. ఇలా రెండు మూడు రోజుల్లో ఎన్నో థియేటర్లను సీజ్ చేశారు. ఇది కొత్త సినిమాలపై ప్రభావం చూపుతోంది.

    స్వచ్చందంగా మూసేయాలని

    స్వచ్చందంగా మూసేయాలని

    ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో అతి తక్కువ ధరలకే టికెట్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని చాలా థియేటర్లు నిన్నటి నుంచే మూసేశారు. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నాయి. దీంతో చాలా సినిమా హాళ్లు మూతపడుతున్నాయి.

    Bigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమేBigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమే

    జగన్‌పై బ్రహ్మాజీ షాకింగ్ ట్వీట్

    జగన్‌పై బ్రహ్మాజీ షాకింగ్ ట్వీట్

    ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు.. తెలంగాణలోని పార్కింగ్ ఫీజు కంటే తక్కువ ఉన్నాయని చెబుతూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీన్ని రీట్వీట్ చేసిన ప్రముఖ నటుడు బ్రహ్మాజీ 'సీఎం జగన్ సార్.. అందరికీ వరాలు ఇస్తున్నారు. పాపం థియేటర్ల ఓనర్లకు, సినిమా వాళ్లకు హెల్ప్ చేయండి. ఇట్లు మీ నాన్నగారి అభిమాని' అంటూ ఊహించని విధంగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.

    English summary
    Tollywood Star Hero Allu Arjun Did Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie theatres shutdown in Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X