చిరంజీవి కోసం బ్రహ్మాజీ అంత పనిచేశాడా?: తలకు గుడ్డ చుట్టుకుని!..

క్యారెక్టర్ డిమాండ్ చేసినా సరే!.. మన హీరోలు గుండు కొట్టించుకుంటారో లేదో తెలియదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం అందుకు వెనుకాడరు. కథ డిమాండ్ చేస్తే.., డైరెక్టర్ పట్టుబడితే.. తెర మీద ఎలా కనిపించడానికైనా సాహసం చేస్తారు. నటుడు బ్రహ్మాజీ కూడా ఇప్పుడు అందుకు సిద్దమైపోయారు.

బ్రహ్మాజీకి కలిసొచ్చిన లక్..:

బ్రహ్మాజీకి కలిసొచ్చిన లక్..:

'ఖైదీ నం.150'తో పక్కా కమర్షియల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు 'సైరా' అంటూ మరోసారి వెండితెర యుద్దానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే అవకాశం వస్తే బాగుండని ఎంతోమంది నటులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అదృష్టం నటుడు బ్రహ్మాజీని వరించింది.

గుండుతో.. బ్రహ్మాజీ:

గుండుతో.. బ్రహ్మాజీ:

మెగాస్టార్ పక్కన కనిపిస్తున్నామంటేనే పండుగ చేసుకునే నటులు.. పాత్ర ఎలాంటిదైనా 'నో' చెప్పే అవకాశమే లేదు. అందుకే గుండుతో కనిపించడానికైనా ఓకె అనేశాడు బ్రహ్మాజీ. సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండుతో కనిపించాలని చెప్పడంతో.. ప్రస్తుతం బ్రహ్మాజీ గుండు కొట్టించుకున్నారు.

ఇలా బయటకు పొక్కింది..:

ఇలా బయటకు పొక్కింది..:

చిరంజీవి 'సైరా' కోసం గుండు కొట్టించుకున్న బ్రహ్మాజీ.. ప్రస్తుతం తలకు ఓ గుడ్డ చుట్టుకుని తిరుగుతున్నారట. సడెన్‌గా బ్రహ్మాజీ ఇలా కనిపిస్తున్నారేంటి అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట. సైరా సినిమాలో ఓ విభిన్న పాత్ర కోసం బ్రహ్మాజీ ఇలా సిద్దమైపోయాడని చెబుతున్నారు.

మలుపు తిప్ప పాత్ర!:

మలుపు తిప్ప పాత్ర!:

అటు కామెడీతోనూ, ఇటు సీరియస్ పాత్రల్లోను బ్రహ్మాజీ ఇప్పటిదాకా వెండితెరపై మెప్పించారు. అయితే తనకంటూ చెప్పుకోవడానికి గొప్ప పాత్రలేమి ఇప్పటివరకు లేవు. 'సైరా' సినిమాతో బ్రహ్మాజీకి ఆ లోటు తీరుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా బ్రహ్మాజీ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా 'సైరా'లో ఆయన పాత్ర ఉండవచ్చునని తెలుస్తోంది.

నత్త నడకన 'సైరా?':

నత్త నడకన 'సైరా?':

ఇకపోతే సైరా సినిమా విషయంలో అనేక పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. సినిమా మొదటి షెడ్యూల్ సరిగా రాలేదని, చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలు వినిపించాయి.

అలాగే హీరోయిన్ నయనతార కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకునే సూచనలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద షూటింగ్ మాత్రం నత్త నడకన సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X