గుండుతో కాదు గుర్రంపై.. సైరా ఫీవర్ నుంచి బయటపడని బ్రహ్మాజీ! వైరల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఆయన కెరీర్ లో తొలిసారి చారిత్రాక నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా టాలీవుడ్, బాలివుడ్‌కి ఎందరో నటీనటులు భాగమయ్యారు. అందరూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. అందులో ఒకరు నటుడు బ్రహ్మాజీ. అయితే ఓ వైపు సైరా రికార్డుల సునామీ సృష్టిస్తుంటే.. బ్రహ్మాజీ మాత్రం సైరా ఫీవర్ నుంచి ఇంకా బయటకు రావడంలేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటారా..?

సైరా జ్ఞాపకాల్లో బ్రహ్మాజీ
సైరా నరసింహా రెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేసే అవకాశం కలిపించాలని రామ్ చరణ్‌ని రిక్వెస్ట్ చేశానని గతంలోనే తెలిపాడు బ్రహ్మాజీ. అయితే ఈ సినిమాలో తాను కూడా ఊహించని విధంగా ఫుల్ లెంగ్త్ రోల్ తనకు కల్పించారని, చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నానని అప్పట్లో పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం ఆ జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్నాడు.

అప్పుడు గుండుతో.. ఇప్పుడు గుర్రంపై
సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించిన నటీనటులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ పెడుతున్న పోస్టులు మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. గతంలో తనకు గుండు చేస్తున్నట్లుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కత్తెర పట్టుకొని నిల్చున్న పిక్ షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తున్న వీడియోతో మ్యాజిక్ చేశాడు.
ఉయ్యాలవాడ వీరుడితో బ్రహ్మాజీ
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో బ్రహ్మాజీ రోల్ చాలా కీలకం. ఆయన పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఉయ్యాలవాడ వీరుడితో కలిసి బ్రహ్మాజీ చేసిన గుర్రపు స్వారీలు, పోరాట ఘట్టాలు సినిమాకే హైలైట్ సన్నివేశాలుగా నిలిచాయి.

సైరా ఊచకోత.. రికార్డుల మోత
మరో వైపు రికార్డుల మోత మోగిస్తూ కెలెక్షన్స్ పరంగా ఊచకోత కొస్తోంది సైరా నరసింహా రెడ్డి మూవీ. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ.. ప్రస్తుతం 250 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. అక్టోబర్ 2న విడుదలైన సైరా.. దసరా సెలవులకు క్యాచ్ చేసుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా
రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించడం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది.


Click it and Unblock the Notifications











