చెప్పులు చూపొద్దు: సమంతతో సీనియర్ యాక్టర్!
హైదరాబాద్: హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో లీడింగ్ హీరోయిన్. మరి అలాంటి సమంత చెప్పులు చూపుతుంటే భరించ లేక పోయాడో? లేక కావాలని జోక్ చేసాడో తెలియదు కానీ......సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ ట్విట్టర్ పోస్టు ఇపుడు హాట్ టాపిక్ అయింది.
అయితే ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం...కేవలం సరదాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘నేను నిన్ను ఫాలో అవుతున్నాను....దయచేసి చెప్పులు చూపొద్దు' అంటూ ట్విట్టర్లో కామెంట్ చేసారు. సమంత పారగాన్ చెప్పులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నేపథ్యంలో సరదాగా ఈ పోస్టు చేసాడు.
కేవలం వ్యాఖ్యలతోనే సరిపెట్టుకోకుండా.....ఓ ఫోటోను కూడా పోస్టు చేసాడు. ఓ ఆర్టీసీ బస్సు వెనక సమంత చెప్పుల యాడ్ ఉంది. వెనకే బ్రహ్మాజీ కారులో వెలుతున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఈ సరదా ఆలోచన వచ్చింది. బ్రహ్మాజీ వ్యాఖ్యలు ఇపుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వడమే కాదు....అందరి మొహంలో నవ్వులు పూయిస్తోంది.



Click it and Unblock the Notifications











