twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి: బ్రహ్మాజీ ఆసక్తికరమైన ట్వీట్

    |

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహం జనవరి 5, 2019న జరుగబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి శుభలేఖల పంపిణీలో రామా రాజమౌళి బిజీగా గడుపుతున్నారు. ఆమె స్వయంగా వెళ్లి సినీ ప్రముఖులకు తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తున్నారు.

    తాజాగా రమారాజమౌళి నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు ఈ రోజుల్లో కొందరు పెళ్లి ఇన్విటేషన్ పంపుతున్న తీరును గుర్తు చేసుకుంటూ... రమా రాజమౌళికి థాంక్స్ చెప్పారు.

    బ్రహ్మాజీ ఏం ట్వీట్ చేశారంటే

    రమా రాజమౌళిగారు పర్సనల్‌గా ఇంటికొచ్చి ఇన్విటేషన్ అందించారు. ఈ మధ్య కొందరు మ్యారేజ్ ఇన్విటేషన్స్ మేనేజర్లను పంపించి ఫోన్లోనో, వాట్సాప్‌లోనో ఇన్వైట్ చేస్తున్నారు. కానీ రమాగారు అలా చేయలేదు. మీకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.

     రాజమౌళి కుటుంబంతో బ్రహ్మాజీ సాన్నిహిత్యం

    రాజమౌళి కుటుంబంతో బ్రహ్మాజీ సాన్నిహిత్యం

    తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అయిన బ్రహ్మాజీకి రాజమౌళి కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాల్లో బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

    కార్తికేయ, పూజ

    కార్తికేయ, పూజ

    ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూమార్తె పూజతో కార్తికేయ వివాహం జరుగబోతోంది. కార్తికేయ, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్లో జరిగిన వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

    రామానాయుడు స్టూడియోలో

    రామానాయుడు స్టూడియోలో

    వీరి పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి ఇక్కడ వేడుక ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం.

    English summary
    "Personally inti kochhi invite chesaru Rama Rajamouli garu..eemadya marriage invites managers tho pampinchi phone lo what’s app lo invite chestunnaru chalamandhi. Thank u Rama garu." Actor Brahmaji.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X