twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' రెండు వందల రోజుల సినిమా

    By Srikanya
    |

    'దూకుడు' ఎంత లేదన్నా రెండు వందల రోజులు అడుతుంది.అంతకన్నా ఎక్కువ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు బ్రహ్మానందం. నిన్న రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన 'దూకుడు' ఆడియో పంక్షన్ కి హాజరైన బ్రహ్మానందం ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రంలో మహేష్ కంప్లీట్ గా ఢిఫెరెంట్ గా కనిపిస్తాడని చెప్పారు. అంతేగాక మహేష్ తన కాంబినేషన్ లో మంచి కామిడీ వర్కవుట్ అయ్యిందని నమ్మకం వ్యక్తం చేసారు. అంతేగాక శ్రీను వైట్ల తనకు ఎప్పుడూ తన సినిమాల్లో మంచి పాత్రలు ఇస్తాడని, ఈ చిత్రంలో కూడా సూపర్బ్ గా ఉండే ఓ పాత్రను డిజైన్ చేసాడని చెప్పుకొచ్చారు. ఇక 'దూకుడు'చిత్రం వచ్చే నెలలో విడుదల కావటానకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో కామిడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్బుతంగా వచ్చాయని చెప్తున్నారు.

    English summary
    "Dookudu will definitely run 200 days. Or even more. He shows his power in the movie and he looks completely different. Mahesh also has done very good comedy in the movie....Brahmanandam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X