twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలచందర్ తో అనుబంధం గురించి బ్రహ్మానందం

    By Srikanya
    |

    హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన ప్రముఖ దర్శకుడు బాలచందర్ ని ఆయనతో పనిచేసిన పలవురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో తమకున్న అనుబంధంను జ్ఞప్తి చేసుకుని బాధపడుతున్నారు. బ్రహ్మానందం గారు...గతంలో రుద్రవీణ చిత్రంలో బాలచందర్ గారి దర్శకత్వంలో చేసారు. ఆనాటి అనుబంధం ను మీడియాతో పంచుకున్నారు. బ్రహ్మానందం మాటల్లోనే...

    https://www.facebook.com/TeluguFilmibeat

    ''నా జీవితం నాకు పరిచయం చేసిన అద్భుతాల్లో... ఈ ప్రయాణంలో ఎదురైన మహనీయుల్లో బాలచందర్‌ ఒకరు! ఆయన్ని తలచుకోగానే ఓరకమైన భక్తి భావం. దక్షిణాది చిత్రాలపై ప్రపంచానికి గౌరవం కల్గించిన మహా దర్శకుడాయన. ఆయనతో పని చేసిన సినిమా ఒక్కటే. కానీ అది అపురూపం. ఆ సినిమానే 'రుద్రవీణ'. ఎప్పుడో పాతికేళ్ల క్రితం నాటి మాట...అప్పుడప్పుడే అవకాశాలొస్తున్నాయి. ఓసారి చిరంజీవిగారు బాలచందర్‌ దగ్గరకు తీసుకెళ్లారు.

    'భలేంటి ఆర్టిస్టండీ.. మన సినిమాలో ఏదో ఓ వేషం ఇవ్వాల్సిందే' అన్నారు నన్ను పరిచయం చేస్తూ. అందులో డాక్టర్‌ వేషం ఒకటుంది. జెమినీ గణేశన్‌కి ఒంట్లో బాలేకపోతే నేను వెళ్లి వైద్యం అందించాలి. చిన్న పాత్రే. అది నాకిచ్చారు. 'బాలచందర్‌ సినిమాలో నటిస్తున్నావా..? జాగ్రత్త సుమీ..' అంటూ నా స్నేహితులు కంగారు పెట్టారు. నాకు తెలియకుండానే భయం వేసింది. 'ఏంటో ఎలా చేస్తానో' అని కంగారు. ఏదో వెళ్లి నాకొచ్చింది చేసేశా! ఆ తరవాత ఎందుకనో.. 'ఈ డాక్టరు పాత్ర వద్దులెండి.. తాగుబోతు క్యారెక్టరుంది.. అది చేయిద్దాం..' అన్నారు బాలచందర్‌. అలా డాక్టరు కాస్తా తాగుబోతునయ్యా!

    Brahmanandam about his relation with Balachandar

    ఇందులో భార్యని బోల్తా కొట్టించి నా కోరిక తీర్చుకొనే సన్నివేశం ఒకటుంది. ఒకే షాట్‌లో చేశా. దాంతో బాలచందర్‌గారి దృష్టిలో పడిపోయా. 'భలే చేశావ్‌... భేష్‌. ఇంకొంచెం ఫ్రీగా ఉండు.. టెన్షన్‌ పడకు..' అని భుజం తట్టారు.

    బాలచందర్‌లాంటి వ్యక్తి మెచ్చుకోవడంతో భలే సంబరమనిపించింది. ఈ సినిమా పూర్తయ్యేలోగా ఏకంగా పదహారు సినిమాలు దక్కించుకొన్నా. ఆఖరికి 'రుద్రవీణ' పతాక సన్నివేశాల్లో నటించడానికి కూడా తీరిక లేకుండా పోయింది. దాంతో ఆ సన్నివేశం ఫైట్‌ మాస్టర్‌ రాజుతో పూర్తి చేశారు.

    చిరంజీవిలాంటి మాస్‌ హీరోతో 'రుద్రవీణ'లాంటి కథ ఎంచుకోవడమేంటండీ? అది బాలచందర్‌ శైలి. అలాంటి అభ్యుదయ భావాలున్న సినిమాలో నాకూ ఓ పాత్ర దక్కడం.. అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది.

    సూర్యుడు వెలుగునిస్తాడు. చంద్రుడూ వెలుగే ఇస్తాడు. కానీ సూర్యుడి వెలుగులో వేడి ఉంటుంది. చంద్రుడు మాత్రం ఎప్పుడూ చల్లదనమే పంచుతాడు. ఆ వెలుగులో ఆర్తి ఉంటుంది. స్ఫూర్తి ఉంటుంది. నాకు తెలిసి బాలచందర్‌ గారు అలాంటి దర్శకుడు. ఆయన బాలచంద్రుడు కాదు.. పరిపూర్ణ చంద్రుడు. 'మరో చరిత్ర' చూస్తే ఆయన ఎంత రొమాంటిక్కో అర్థమవుతుంది. ఆ వయసులో ఓ అజరామరమైన ప్రేమ కథ ఎలా తీయగలిగారో..?

    'ఆకలి రాజ్యం'లో శ్రీదేవి ఇంటికొచ్చినప్పుడు కమల్‌హాసన్‌, అతని స్నేహితులు భోజనం చేస్తున్నట్టు నటించే సీన్‌ ఒకటుంది. అసలు ఆ ఆలోచన బాలచందర్‌గారికి ఎలా వచ్చిందో..? యువతరం మనస్తత్వం, ఆకలి, స్నేహం, ప్రేమ... ఇలా అన్నీ కలగలిపి ఆ ఒక్క సన్నివేశంలో అద్భుతం సృష్టించారు. 'అంతులేని కథ'లోని ఏ సన్నివేశమైనా తీసుకోండి. మనసుల్ని మెలేసేస్తుంటుంది. ఆ టెక్నిక్‌ బాలచందర్‌గారికే తెల్సు.

    'దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ..' ఈ పాట మొదట్లో విన్నప్పుడు అర్థం కాలేదు. మళ్లీ మళ్లీ వింటే.. 'ఇంత వేదాంతం ఎలా రంగరించారు?' అనిపిస్తుంది. పాటల్ని కూడా తన భావాలకు వేదిక చేసుకొన్నారాయన. సహజత్వానికి ఇంత దగ్గరగా వెళ్లిన దర్శకుడు దక్షిణాదిన మరొకరు లేరేమో అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇలా ఏ సినిమా తీసుకున్నా, ప్రతి పాత్రతోనూ మనకు ఏదో ఓ రూపంలో అనుబంధం పెంచుకొంటాం.

    ఈమధ్య ఓ వేడుకలో ఆయన్ని కలుసుకొన్నా. నన్ను దగ్గరకు పిలిచి.. 'గొప్ప నటుడివయ్యావ్‌. నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది..' అంటూ ముద్దు పెట్టుకొన్నారు. ఆస్కార్‌ అవార్డులు నా దోసిట్లో గుమ్మరించినట్టు అనిపించింది. శ్రీరాముడి ముందు హనుమంతుడిలా చేతులు కట్టుకొని నిలబడ్డా. చాలు.. ఈజన్మకు ఏం కావాలి అనిపించింది'' అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.

    English summary
    K Balachander (KB) was truly the Everest among directors. He had the knack of spotting talent like no one else. All the big names in the South industry today owe some of our best films to his creative genius Said Brahmanandam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X