ప్రకాష్ రాజ్ ని కంటిన్యూగా తిడుతూంటాడు

By Srikanya

హైదరాబాద్ : ప్రకాష్‌రాజ్‌గారు డ్యూయల్‌ రోల్‌ పోషించారు. ఆ విషయం తెరపై నాకు తెలియదు. చూస్తున్న ఆడియన్‌కి అర్థమవుతుంది. ఆయన దగ్గర పనిచేసే పాత్ర నాది. ఒక ప్రకాష్‌రాజ్‌ని తిట్టబోయి మరొకరిని తిడుతుంటాను.. దీనివల్ల కామెడీ జనరేట్‌ అవుతుంటుంది అంటున్నారు బ్రహ్మానందం. ఆయన తాజాగా నటించిన అల్లుడు శ్రీను చిత్రంలో తన పాత్ర గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే ... అల్లుడు శీనులో నా పాత్ర పేరు డింపుల్‌. వినాయక్‌ నా పాత్రకు పెట్టే పేరే గమ్మత్తుగా ఉంటుంది. తను పెట్టే పేర్లకు నా ఫేసుకు అసలు సూట్‌ కాదు. అందుకేనేమో... కామెడీ పండటం అక్కడి నుంచే మొదలవుతుంది. 'అల్లుడు శీను'లో పెద్ద కేరక్టర్‌ చేశాను. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోలతో సినిమాలను నల్లేరు మీద నడకలా నడిపించే వినాయక్‌ ఈ సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డారు. 'ఆది'తో తనను పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్‌గారి కోసం ఒక రకంగా ఈ చిత్రాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని చేశారు. ప్రతి పాత్రపై ఆయన చూపించిన శ్రద్ధ అసామాన్యం. నా పాత్రను మలిచిన తీరు చూసి ఆశ్చర్యపోయాను. కామెడీని ఇంత గొప్పగా చేయొచ్చా? అని అనిపించింది అన్నారు.

Brahmanandam about his role in Alludu Seenu

ఇక ఈ సినిమాకు పనిచేసిన వారందరూ వారి వారి రంగాల్లో గొప్పవారే. సమంత బార్న్‌ ఆర్టిస్ట్‌. సంగీతం చేసిన దేవిశ్రీ ప్రసాద్‌ లబ్ద ప్రతిష్ఠుడు. ఛోటా.కె.నాయుడు చాలా బాగా తెరకెక్కించారు. హాలీవుడ్‌ సినిమాలో కనిపించే కెమెరా టెక్నిక్స్‌ గుర్తుకొస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆడుతూ పాడుతూ చేసేశాడు. చుట్టూ హేమాహేమీలైన నటీనటులున్నా అతనేమీ తొట్రుపాటు పడలేదు. చాలా సులువుగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. తన ఫైట్లు, డ్యాన్సులు చూశాను. చాలా బాగా చేశాడు.

తెలుగు సినిమా మెయిన్‌ హీరోలలో తప్పకుండా ఒకరిగా నిలుస్తాడు. వీరందరికన్నా ముందు బెల్లంకొండ సురేష్‌గారి గురించి చెప్పాలి. కొడుకు తొలి సినిమా అనే ప్రేమ ఆయనకు తప్పకుండా ఉంటుంది. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కించారు. ఆయనది స్పెషల్‌ గుండె. నా దృష్టిలో ఆయన గుండె స్టీల్‌తో చేసింది. ఈ సినిమా గ్రాండియర్‌ కోసం ఆయన చాలా ఎక్కువ ఖర్చుపెట్టారు. ఈ సినిమాకు డైలాగులు కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌. అమ్మ రాజశేఖర్‌, తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు శీను ఉండకూడదా? అనే డైలాగు థియేటర్‌లో పేలుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నాన్‌ వెజ్‌ సినిమా. అది కూడా మిలిటరీ హోటల్లో భోజనం చేసినట్టు ఉంటుంది అని వివరించారు.

వినాయక్‌ చెబుతూ ''ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ పాత్ర కీలకం. మొత్తం అరవై సన్నివేశాలుంటే అందులో నలభై సన్నివేశాల్లో ప్రకాష్‌రాజ్‌ కనిపించాలి. ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం నాకు కనిపించలేదు. అందుకే ఆయన డేట్స్‌ కోసం మూణ్నెళ్లు ఆగాల్సి వచ్చింది. ప్రకాష్‌రాజ్‌ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ నటించడానికి చాలా ధైర్యం కావాలి. కానీ శ్రీనివాస్‌ చాలా ఈజ్‌తో నటించేశాడు. ఇటీవల సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమందికి చూపించాం. వాళ్లంతా చాలా థ్రిల్‌ అనుభవించారు. ప్రేక్షకులలోనూ ఇలాంటి స్పందనే వస్తుందన్న నమ్మకం ఉంద''న్నారు. ఈ నెల 25న 'అల్లుడు శీను' విడుదలకానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X