వేరే ఆలోచన ఏదీ నా మనస్సులోకి రాలేదు: బ్రహ్మానందం

By Srikanya

Brahmanandam about his son's‘Basanthi’
హైదరాబాద్ : ''ఈ మధ్య కాలంలో నేను సినిమాలు చూడటం చాలా వరకు తగ్గించేశాను. అలాంటిది ఇటీవల 'బసంతి' సినిమా చూశాను. చూస్తున్న రెండు గంటల సేపు వేరే ఆలోచన ఏదీ నా మనసులోకి రాలేదు. ఇదేదో నా కొడుకు సినిమా అని చెప్పడం లేదు. సమాజానికి ఉపయోగపడే ఓ సినిమా అనే ఆలోచనతోనే చెప్తున్నాను. ' 'అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆయన కుమారుడు రాజాగౌతమ్‌ హీరోగా నటించిన చిత్రం 'బసంతి'. అలీషాబేగ్‌ హీరోయిన్. చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

అలాగే ''సినిమా టైటిల్‌ విషయంలోనే దర్శకుడి పనితనం కనిపిస్తుంది. ప్రేమకు చిహ్నంగా గులాబి పువ్వుని, కింద తుపాకీని పెట్టాడు. అలాగని ఇదేదో ప్రయోగాత్మక చిత్రం కాదు.. అన్ని వాణిజ్యపరమైన హంగులున్న చిత్రమిది. ఈ సినిమాతో గౌతమ్‌ నా పేరు నిలబెడతాడన్న నమ్మకం ఉందిగౌతమ్‌ నా ఏకైక ఆస్తి. వాడి సినిమా కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రాజమౌళి, శ్రీనువైట్ల, సురేందర్‌రెడ్డి ఈ సినిమాను, గౌతమ్‌ను అభినందిస్తూ మాట్లాడారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.

చైతన్య దంతులూరి మాట్లాడుతూ ''ఉగ్రవాదం సమస్యని నేపథ్యంగా ఎంచుకొని తెరకెక్కించిన సినిమా ఇది. బసంతి కళాశాలలో చదివే విద్యార్థిగా గౌతమ్‌ కనిపిస్తారు. బాణం చిత్రానికి ముందే ఈ బసంతి చిత్ర కథ సిద్ధమైంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము. బసంతి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ సైన్స్‌'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా గౌతమ్‌ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.''అన్నారు.

హీరో గౌతమ్‌ మాట్లాడుతూ ''ఓ మంచి కథ బసంతి. దర్శకుడు కథ చెబుతున్నపుడు ఎంతో ఆసక్తి కలగడంతో పాటు, ఉద్వేగా నికి లోనయ్యాను. నేను పోషిస్తున్న అర్జున్‌ పాత్ర నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నా''అన్నారు.

నక్సలిజం సమస్యని... తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా 'బాణం' రూపంలో తెరకెక్కించారు దర్శకుడు చైతన్య దంతులూరి. ఇప్పుడు ఆయన దర్శకనిర్మాణంలో వస్తోన్న మరో చిత్రం 'బసంతి'. ఇందులో తీవ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. రణధీర్‌ గట్ల, నవీనా జాక్సన్‌, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: మణిశర్మ, కళ: రఘు కులకర్ణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: అనీల్‌ బండారి, పి.కె.వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X