సరదాగా కోసం పవన్, త్రివిక్రమ్, బ్రహ్మీ గంటల తరబడి!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మానందం తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. గురుపూజోత్సవం సందర్భంగా ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఒకప్పుడు నేను గురువునే అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో గైడ్ చేయడాలు, క్లాసులు తీసుకోవడాలు ఏమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తుంటాయ్. అన్ని సమస్యలూ పరిష్కారం అవుతుంటాయ్. అప్పుడప్పుడూ సరదాగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లాంటి వాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. నేనేమీ వాల్లకు గురువును కాదే! ఇది సత్సంగం లాంటిది. ఒక అంశం మీద గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓసారి వాళ్లిద్దరూ ఉదయం 9 గంటలకు మా ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. ముగ్గురం అంతసేపూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రకరకాల టాపిక్స్ మా మధ్య నడిచాయి' అన్నారు.

నేను చాలా యాక్టివ్‌గా, జోవియల్‌గా ఉంటాను. నా చుట్టు పక్కల వాతావరణం డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు. మనం యాక్టివ్ గా ఉంటే, మన లైఫ్ కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఇందిరాగాంధీ వాకింగ్ స్టయిల్ ఎప్పుడైనా చూసారా? అంత ఎనర్జీగా ఉండాలి అని పత్రిక ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
‘ఇంత వయసు వచ్చినా నా ముఖంగాపై ముడతలు రాలేదేంటని ఈ మధ్యనే ఒకరడిగారు. దానికి నా సమాధానం ఒకటే. మనసులో ముడతలు లేక పోతే, ముఖాన ముడతలు రావు. మంచి ఆలోచనలతో ఉన్నపుడు మన ముఖం ఎలా ఉంటుందో, చెడ్డ ఆలోచనలతో ఉన్నపుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మనకే ఆ రహస్యం తెలిసి పోతుంది' అని సాక్షి పత్రిక ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











